మున్సిపల్ సిబ్బందికి మిలిటరీ యూనిఫామ్‌పై రాజకీయ రగడ!
ఇండోర్ మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది యూనిఫాంపై రాజకీయంగా దుమారం రేగింది. మున్సిపల్ సిబ్బందికి మిలిటరీ తరహాలోని యూనిఫాం అందజేసింది ఇండోర్ మున్సిపాలిటీ.
దిశ, నేషనల్ బ్యూరో: ఇండోర్ మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది యూనిఫాంపై రాజకీయంగా దుమారం రేగింది. మున్సిపల్ సిబ్బందికి మిలిటరీ తరహాలోని యూనిఫాం అందజేసింది ఇండోర్ మున్సిపాలిటీ. దీనిపైనే వివాదం చెలరేగింది. ఐఎంసీ సిబ్బందిది మిలటరీ యూనిఫాం అని కాంగ్రెస్ పైర్ అయ్యింది. “అవినీతి” ఉద్యోగులు ఆర్మీ దుస్తులు ధరించి వారిని అవమానించారని కాంగ్రెస్ మండిపడింది.
ఐఎంసీ ప్రతిపక్ష నేత చింటూ చౌక్సే మాట్లాడుతూ.. మున్సిపల్ సిబ్బందికి సైనికుల యూనిఫాం ఇచ్చి.. ఆర్మీని అవమానించారని ధ్వజమెత్తారు. మున్సిపల్ సిబ్బంది వీధి వ్యాపారుల నుంచి దోపీడికి పాల్పడటంలో ప్రసిద్ధి అని ఆరోపించారు. ఆర్మీ లాంటి యూనిఫాం మున్సిపల్ సిబ్బంది ధరించడం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. వేరే యూనిఫాం ఎంచుకోవాలని సూచించారు. సైన్యాన్ని అవమానించినందుకు ఐఎంసీ మేయర్ పుష్యమిత్ర భార్గవ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఐఎంసీ కమిషనర్ శివమ్ వర్మను ఆ పదవి నుంచి తొలగించాలని పిలుపునిచ్చారు.
ఐఎంసీ మేయర్ భార్గవ మాట్లాడుతూ.. యాంటీ ఎన్‌క్రోచ్‌మెంట్ స్క్వాడ్ కొత్త యూనిఫామ్‌ల పై స్పందించారు. ఆర్మీని పోలి ఉన్న యూనిఫాం ధరిచడం నేరం కాదని.. ఆర్మీ చిహ్నాన్ని ధరిస్తే నేరం అని తెలిపారు. యాంటీ ఎన్‌క్రోచ్‌మెంట్ స్క్వాడ్ సిబ్బందికి కొత్త యూనిఫాం ఎంపిక చేసింది క్రమశిక్షణ కోసమని ఐఎంసీ కమిషనర్ తెలిపారు. ఈ యూనిఫామ్‌పై ఎవరికైనా అభ్యంతరం ఉంటే, దాన్ని పరిశీలించి నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.