కేజ్రీవాల్‌ను బెదిరిస్తూ సందేశాలు..ఢిల్లీలో ఓ వ్యక్తి అరెస్టు
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ లక్ష్యంగా దేశ రాజధానిలోని పటేల్ నగర్, రాజీవ్ చౌక్ మెట్రో స్టేషన్లలో ఓ వ్యక్తి సందేశాలు రాశారు. కేజ్రీవాల్‌ను బెదిరిస్తూ గ్రాఫిటీ వేశారు.
దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ లక్ష్యంగా దేశ రాజధానిలోని పటేల్ నగర్, రాజీవ్ చౌక్ మెట్రో స్టేషన్లలో ఓ వ్యక్తి సందేశాలు రాశారు. కేజ్రీవాల్‌ను బెదిరిస్తూ గ్రాఫిటీ వేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ టీవీ పుటేజీ ద్వారా నిందితుడిని గుర్తించి బుధవారం అరెస్టు చేశారు. ఆయనను బరేలీకి చెందిన అంకిత్ గోయల్‌గా గుర్తించారు. ఢిల్లీ పోలీసుల మెట్రో యూనిట్ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిందని, ప్రస్తుతం ఈ విషయంపై దర్యాప్తు జరుగుతోందని పోలీసులు తెలిపారు. అయితే గోయల్ ఓ ప్రయివేటు బ్యాంకులో పని చేస్తు్న్నట్టు తెలుస్తోంది. ఇల్లు కొనుగోలు చేసేందుకు బరేలీ నుంచి గ్రేటర్ నోయిడాకు వచ్చి ఓ హోటల్‌లో బస చేస్తు్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే కేజ్రీవాల్‌ను బెదిరిస్తూ మెట్రో స్టేషన్లలో సందేశాలు రాశారు. ఈ పరిణామంపై ఆప్ స్పందించింది. ఈ ఘటన వెనుక బీజేపీ హష్తం ఉందని ఆరోపించింది.ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీలోని మొత్తం ఏడు నియోజకవర్గాల్లో ఓటమి పాలవుతుందన్న భయంతోనే ఈ చర్యలను పాల్పడుతున్నారని తెలిపింది.
Read More..
అమెరికాలో రోడ్డు ప్రమాదం: ముగ్గురు భారత సంతతి విద్యార్థులు మృతి