సామాన్యులకు బిగ్ షాక్.. పెరగనున్న జ్వరం ట్యాబ్‌లెట్స్‌తోపాటు ఆ మందుల ధరలు
సామాన్యులకు బిగ్ షాక్ తగిలింది. ఇప్పటికే నిత్యవసర ధరలు పెరిగి సామాన్యడు ఇబ్బంది పడుతుంటే మరో సారి సామాన్యులపై భారం పడనుంది. అనారోగ్యంతో మెడికల్ షాప్‌కు
దిశ, వెబ్‌డెస్క్ : సామాన్యులకు బిగ్ షాక్ తగిలింది. ఇప్పటికే నిత్యవసర ధరలు పెరిగి సామాన్యడు ఇబ్బంది పడుతుంటే మరో సారి సామాన్యులపై భారం పడనుంది. అనారోగ్యంతో మెడికల్ షాప్‌కు వెళ్లి ట్యాబ్ లెట్ తెచ్చుకోవాలంటే భయపడే పరిస్థితి దాపరించింది. ఎందుకంటే? దేశంలో మందుల ధరలు పెరగనున్నాయి.
మెడిసన్ ధరలు పెరగనున్నాయని, ఏకంగా 800ల రకాల మెడిసన్స్‌పై 12.12శాతం ధరలు పెరగనున్నట్లు ఎన్‌పీపీఏ తెలిసింది. ఈ పెరిగిన ధరలు ఎప్రిల్ 1నుంచి అమలులోకి రానున్నాయి. దీంతో నిత్యవసర ధరలు పెరుగుతున్న నేపథ్యంలో, మందుల ధరలు కూడా పెరుగుతాయి అన్న వార్త సామాన్యుడి కంటి మీద కేనుకు లేకుండా చేస్తుంది.
ఏప్రీల్ 1 నుంచి ఫీవర్, బీపీ, డయాబెటీస్, గుండె జబ్బులు, చర్మ వ్యాధులు, ఇన్ఫెక్షన్లు, అనీమియా తదితర చికిత్సలకు వినియోగించే మందులతో పాటు పెయిన్ కిల్లర్, యాంటీ ఇన్ఫెక్టివ్స్, యాంటీబయాటిక్స్ తో పాటు కార్డియాక్ మందుల ధరలు సైతం పెరగనున్నాయి. అయితే మందుల ధరలు పెరగడం ఇది వరుసగా రెండోసారి అంటున్నారు. కరోనా సమయంలో 10 శాతం మందుల ధరలు పెరగగా, ప్రస్తుతం మందుల్లో వినియోగించే ముడి పదార్థాలు, ఏపీఐ ధరలు పెరగడం, ప్యాకింగ్, రవాణా ధరల పెరుగుదలతో ఔషదాల ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రప్రభుత్వం తెలిపింది.
ఏయే మందుల ధరలు పెరగనున్నాయంటే?
జ్వరం మందులు (పారాసిటమాల్ వంటివి)
యాంటి బయోటిక్స్ (అజిత్రోమైసిన్ వంటివి)
అంటువ్యాధులు
గుండె సంబంధిత వ్యాధులు
రక్తపోటు (బీపీ)
డయాబెటిస్ (షుగర్)
చర్మవ్యాధులు, ఇన్‌ఫెక్షన్లు
రక్తహీనత (ఫోలిక్ యాసిడ్ వంటి ఔషధాలు)
రక్తప్రసరణ సంబంధిత జబ్బులు
క్షయ (టీబీ)
వివిధ రకాల క్యాన్సర్లు
మినరల్, విటమిన్ తదితర గోళీలు
మరో 800 రకాల అత్యవసర ఔషధాలు, మెడికల్ డివైజ్‌లు
ఇవి కూడా చదవండి: మతి మరుపును తగ్గించి.. జ్ఞాపకశక్తి మెరుగుపరచడానికి మార్గాలు