Mayawati: సుప్రీంకోర్టు తీర్పుతో ఏకీభవించం.. ఎస్సీ, ఎస్టీ వర్గీకరణపై మాయవతి

ఎస్సీ వర్గీకరణపై ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై బహుజన్ సమాజ్ వాదీ పార్టీ(బీఎస్పీ) చీఫ్ మాయవతి స్పందించారు.

Update: 2024-08-04 13:55 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఎస్సీ వర్గీకరణపై ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై బహుజన్ సమాజ్ వాదీ పార్టీ(బీఎస్పీ) చీఫ్ మాయవతి స్పందించారు. ఈ తీర్పుతో తమ పార్టీ ఏకీభవించడం లేదని తెలిపారు. దీనిని పూర్తిగా విభేదిస్తున్నట్టు చెప్పారు. ఆదివారం ఆమె లక్నోలో మీడియాతో మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీల ఉప వర్గీకరణకు అత్యున్నత న్యాయస్థానం అనుమతించడాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించబోమన్నారు. ఎస్సీ, ఎస్టీ వర్గాల ప్రజలు తమపై జరుగుతున్న అఘాయిత్యాలను ఐక్యంగా ఎదుర్కొన్నారని, వీరంతా ఒకటిగా ఉన్నందున ఉపవర్గీకరణ చేయడం సరికాదన్నారు. రిజర్వేషన్లపై కొత్త జాబితా తయారు చేయడం వల్ల అనేక సమస్యలు వస్తాయన్నారు. ప్రస్తుత పరిస్థితిని అర్థం చేసుకుని ఎస్సీ, ఎస్టీ వర్గాల ప్రజలు ఐక్యం కావాలని, వారు విడిపోయినట్లయితే ప్రత్యర్థులు లాభం పొందే అవకాశం ఉందని హెచ్చరించారు. కాగా, ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ చేయడానికి రాజ్యాంగబద్ధంగా రాష్ట్రాలకు అధికారం ఉందని సుప్రీంకోర్టు ఇటీవల తీర్పు వెల్లడించిన విషయం తెలిసిందే.

Tags:    

Similar News