BCCI టైటిల్ స్పాన్సర్‌గా Mastercard
న్యూఢిల్లీ: భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ) ఆధ్వర్యంలో స్వదేశంలో జరిగే జాతీయ, అంతర్జాతీయ క్రికెట్ మ్యాచులకు టైటిల్ స్పాన్సర్‌షిప్ హక్కులను సోమవారం గ్లోబల్ పేమెంట్స్ అండ్ టెక్నాలజీ కంపెనీ మాస్టర్‌కార్డ్ దక్కించుకుంది.
న్యూఢిల్లీ: భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ) ఆధ్వర్యంలో స్వదేశంలో జరిగే జాతీయ, అంతర్జాతీయ క్రికెట్ మ్యాచులకు టైటిల్ స్పాన్సర్‌షిప్ హక్కులను సోమవారం గ్లోబల్ పేమెంట్స్ అండ్ టెక్నాలజీ కంపెనీ మాస్టర్‌కార్డ్ దక్కించుకుంది. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. ఇప్పటివరకు బీసీసీఐ టైటిల్ స్పాన్సర్‌గా కొనసాగిన పేటీఎం తప్పుకోవడంతో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన ఒప్పంద ప్రక్రియ పూర్తయిందని బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా గంగూలీ మాట్లాడుతూ.. '2022-23లో స్వదేశంలో జరిగే క్రికెట్ మ్యాచులకు టైటిల్ స్పాన్సర్‌గా మాస్టర్‌కార్డ్ వ్యవహరించనుంది. భారత క్రికెట్ అభివృద్ధికి మాస్టర్‌కార్డ్ మద్దతు తెలపడం సంతోషకరమైన విషయం. దేశవాళీ టోర్నమెంట్‌లు భారత్‌ను బలమైన అంతర్జాతీయ జట్టుగా మార్చడంలో కీలకపాత్ర పోషిస్తాయి.' అని అన్నారు. కాగా, 2015లో బీసీసీఐ పేటీఎంతో నాలుగేళ్లపాటు టైటిల్ స్పాన్సర్‌షిప్ ఒప్పందం కుదుర్చుకుంది. భారత్‌లో జరిగే జాతీయ, అంతర్జాతీయ మ్యాచులకు పేటీఎం రూ.203 కోట్లు చెల్లించింది. అయితే ఈ నెల భారత్‌లో జరిగే ఆస్ట్రేలియా మూడు మ్యాచుల టీ20 సిరీస్‌కు మాస్టర్‌కార్డ్ టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహరించనుంది