Fire Accident : బాంబే మార్కెట్‌లో భారీ అగ్ని ప్రమాదం

గుజరాత్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సూరత్‌‌లోని ప్రముఖ బాంబే మార్కెట్‌లోని ఓ షోరూమ్‌లో ఇవాళ ఉదయం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

Update: 2023-10-03 10:44 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: గుజరాత్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సూరత్‌‌లోని ప్రముఖ బాంబే మార్కెట్‌లోని ఓ షోరూమ్‌లో ఇవాళ ఉదయం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్థానికులు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దాంతో పోలీసులు అగ్నిమాపక సిబ్బందితో కలిసి హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. 10,12 ఫైరింజన్‌ల సాయంతో మంటలను ఆర్పేసి అదుపులోకి తెచ్చారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందన్నారు. ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని చీఫ్ ఫైర్ ఆఫీసర్ కృష్ణ పేర్కొన్నారు.

Tags:    

Similar News