Mann ki Baat: 'హర్ ఘర్ తిరంగా' ప్రోగ్రాం తిరిగి ప్రారంభించాలి- మోడీ

పారిస్‌ ఒలింపిక్స్‌లో బరిలోకి దిగుతున్న భారత క్రీడాకారులకు మద్దతుగా నిలవాలని ప్రధాని మోడీ కోరారు. ఆదివారం 112వ మన్ కీ బాత్ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు.

Update: 2024-07-28 09:35 GMT

దిశ, నేషనల్ బ్యూరో: పారిస్‌ ఒలింపిక్స్‌లో బరిలోకి దిగుతున్న భారత క్రీడాకారులకు మద్దతుగా నిలవాలని ప్రధాని మోడీ కోరారు. ఆదివారం 112వ మన్ కీ బాత్ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. దేశ జెండాని ప్రపంచం ఎదుట ప్రదర్శించే అవకాశం వారికే ఉందని పేర్కొన్నారు. క్రీడాకారులని ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమాని పునః ప్రారంభించాలని సూచించారు. యూకేలో జరిగిన ఇంటర్నేషనల్ మాథ్ ఒలింపియాడ్ లో పాల్గొన్న జట్టుని ప్రశంసించారు. దాదాపు వంద దేశాలు పాల్గొన్న ఈ పోటీలో మనవాళ్లు అద్భుత విజయం సాధించారని అన్నారు. ఈ పోటీలో భారత్ నాలుగు బంగారు పతకాలు గెలిచింది. వారందని ప్రధాని మోడీ అభినందించారు.

వారసత్వ సంపదను ముందుకు తీసుకెళ్లాలి

అసోంలోని చారాడ్‌దేవ్‌ మోదమ్‌కు యూనెస్కో వారసత్వ క్షేత్రంగా గుర్తింపు వచ్చింది. దీనిపై ప్రధాని మోడీ సంతోషం వ్యక్తం చేశారు. దేశంలో ఈ గౌరవం దక్కిన 43వ ప్రదేశమని అన్నారు. ఈ ప్రదేశాన్ని అందరూ సందర్శించాలని అన్నారు. వారసత్వ సంపదను ముందుకు తీసుకెల్తేనే అభివృద్ధి జరుగుతుందన్నారు. ప్రాజెక్టు పరి అందుకోసమే చేస్తున్నామన్నారు. భారత్‌ మండపంలో కళాకృతుల్లో దేశ సంస్కృతి ఉట్టిపడుతోందన్నారు. హర్యానాలోని రోహ్‌తక్‌ లో 250 మంది మహిళలు బ్లాక్‌ పెయింటింగ్‌, డయింగ్‌లో శిక్షణ పొందారని. దాంతో స్వయం ఉపాధి పొంది వారి జీవితాలను మార్చుకున్నారని కొనియాడారు. దేశవ్యాప్తంగా ఖద్దర్‌ విక్రయాలు 400 రెట్లు పెరిగి తొలిసారి రూ.1.5 లక్షల కోట్లను దాటాయన్నారు.


Similar News