మనీష్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీ ఏప్రిల్ 3 వరకు పొడిగింపు
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణం కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు సోమవారం ఏప్రిల్ 3న పొడిగించింది.
దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణం కేసులో విచారణ ఇంకా పెండింగ్‌లో ఉందని, జ్యుడీషియల్ కస్టడీని మరో 14 రోజులు పొడిగించాలని సిబిఐ కోరింది. అలాగే దర్యాప్తు కీలక దశలో ఉందని సీబీఐ పేర్కొంది. దీంతో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు సోమవారం ఏప్రిల్ 3 వరకు పొడిగించింది.