ఆయనను మానసికంగా వేధిస్తున్నది.. సీబీఐ సంస్థపై ఆప్ సంచలన ఆరోపణలు

ఆమ్ ఆద్మీ పార్టీ కేంద్ర దర్యాప్తు సంస్థ పై తీవ్ర విమర్శలు చేసింది.

Update: 2023-03-05 16:23 GMT

న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ కేంద్ర దర్యాప్తు సంస్థ పై తీవ్ర విమర్శలు చేసింది. కస్టడీలో ఉన్న మాజీ మంత్రి మనీష్ సిసోడియా ను మానసికంగా వేధిస్తున్నారని ఆప్ ఆరోపించింది. తప్పుడు ఆరోపణలను ఒప్పుకునేందుకు ఒత్తిడి తీసుకొస్తున్నారని ఆప్ సీనియర్ నేత సంజయ్ సింగ్ ఆదివారం మీడియా సమావేశంలో వెల్లడించారు. పేద పిల్లల కోసం పనిచేసిన వ్యక్తికి ఇలా జరగడం దురదృష్టకరమని అన్నారు. అమెరికా అధ్యక్షుడు కూడా సిసోడిన పనితనాన్ని మెచ్చుకున్నారని తెలిపారు.

అలాంటి వ్యక్తిని సీబీఐ మానసికంగా వేధిస్తున్నదని అన్నారు. ఈ విషయాన్ని సిసోడియా న్యాయవాదుల ద్వారా తెలుసుకున్నట్లు చెప్పారు. మరోవైపు కాంగ్రెస్ ఎప్పుడు కూడా విపక్షాలకు మద్దతుగా లేదని ఆరోపించారు. సిసోడియా అరెస్టులో బీజేపీకి మద్దతుగా మాట్లాడుతుందని విమర్శించారు. వారం రోజుల క్రితం సిసోడియా లిక్కర్ స్కాం అవినీతి ఆరోపణలతో విచారణ భాగంగా అరెస్టైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సీబీఐ కస్టడీలో ఉన్నారు.

Tags:    

Similar News