Manifesto: ఆప్ ‘మిడిల్ క్లాస్ మేనిఫెస్టో రిలీజ్’.. ఏడు పాయింట్ల ప్రణాళికను వెల్లడించిన కేజ్రీవాల్

ఢిల్లీ ఎన్నికల్లో మధ్యతరగతి ప్రజలకు తమవైపు తిప్పుకునేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కీలక నిర్ణయం తీసుకుంది.

Update: 2025-01-22 14:24 GMT
Manifesto: ఆప్ ‘మిడిల్ క్లాస్ మేనిఫెస్టో రిలీజ్’.. ఏడు పాయింట్ల ప్రణాళికను వెల్లడించిన కేజ్రీవాల్
  • whatsapp icon

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ ఎన్నికల్లో మధ్యతరగతి ప్రజలకు తమవైపు తిప్పుకునేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ (Aap) కీలక నిర్ణయం తీసుకుంది. మిడిల్ క్లాస్ మేనిఫెస్టో (Middle class manifesto) పేరుతో ఏడు పాయింట్ల ప్రణాళికను ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ (Aravind Kejriwal) రిలీజ్ చేశారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఈ డిమాండ్లు నెరవేర్చాలని తెలిపారు. కేజ్రీవాల్ మేనిఫెస్టోలో దేశంలో విద్యా బడ్జెట్‌ను ప్రస్తుతమున్న 2 శాతం నుంచి 10 శాతానికి పెంచడం, ప్రయివేట్ పాఠశాలల్లో ఫీజులపై పరిమితిని విధించడం, నాణ్యమైన విద్యను అందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి ఉన్నత విద్యకు రాయితీలు, స్కాలర్‌షిప్‌లు కల్పించడం వంటివి ఉన్నాయి.

అలాగే ఆరోగ్య బీమా ప్రీమియంలపై పన్నుల తొలగింపుతో పాటు జీడీపీలో 10 శాతానికి పెరగాలని తెలిపారు. అంతేగాక ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని రూ.7 లక్షల నుంచి రూ. 10 లక్షలకు పెంచాలని కేజ్రీవాల్ సూచించారు. సీనియర్ సిటిజన్ల (Senior citizens)కు ప్రయివేట్, ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచిత ఆరోగ్య సంరక్షణ, రైలు చార్జీలపై ఇటీవలి నిలిపివేయబడిన 50 శాతం రాయితీని పునరుద్ధరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. దేశంలో వచ్చే బడ్జెట్‌ను మధ్యతరగతి ప్రజలకే అంకితం చేయాలని డిమాండ్‌ చేశారు.

టాక్స్ టెర్రరిజానికి మధ్య తరగతి బలి: కేజ్రీవాల్

ఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ.. మధ్య తరగతి ప్రజలపై ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించాయని ఆరోపించారు. టాక్స్ టెర్రరిజానికి వారంతా బలయ్యారని మండిపడ్డారు. దేశంలో మధ్య తరగతి ఆర్థిక వ్యవస్థే సూపర్ పవర్ అని కానీ చాలా కాలంగా వారంతా విస్మరించారని తెలిపారు. కేవలం పన్నుల వసూళ్ల కోసం మాత్రమే వారిని వాడుకున్నారని ఫైర్ అయ్యారు. తొలిసారిగా మధ్యతరగతి ప్రజల కోసం ఓ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేస్తోందని ప్రశంసించారు. 

Tags:    

Similar News