కరోనాతో చనిపోయాడనుకుని అంత్యక్రియలు.. రెండేళ్ల తర్వాత ఇంటికొచ్చిన వ్యక్తి
మధ్యప్రదేశ్లో ఆశ్చర్యకర ఘటన చోటుచేసుకుంది. రెండేళ్ల క్రితం కరోనా మరణించిన వ్యక్తి కమలేష్ పాటిదార్ తిరిగి ఇంటికొచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
భోపాల్: మధ్యప్రదేశ్లో ఆశ్చర్యకర ఘటన చోటుచేసుకుంది. రెండేళ్ల క్రితం కరోనా మరణించిన వ్యక్తి కమలేష్ పాటిదార్ తిరిగి ఇంటికొచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తాజాగా ధార్ జిల్లాలోని నివాసానికి వచ్చాడని చెప్పారు. శనివారం కరోడ్కలాగ్రామంలోని తన బంధువుల నివాసానికి వచ్చి అందరిని ఆశ్చర్యానికి గురి చేసినట్లు వెల్లడించారు. కరోనా రెండో వేవ్ సమయంలో కమలేష్ వైరస్ బారిన పడ్డాడు. దీంతో గుజరాత్ ఆసుపత్రిలో చేర్చగా.. చికిత్స పొందుతూ మరణించినట్లు వైద్యులు తెలిపారు.
ఈ క్రమంలో ఆసుపత్రి సిబ్బంది మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించగా అంతిమ కార్యక్రమం నిర్వహించారు. అయితే అదే వ్యక్తి తాజాగా ఇంటికి రావడం సంచలనం రేపింది. ఈ రెండేళ్ల పాటు ఎక్కడున్నాడనే విషయాన్ని వెల్లడించలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే కమలేష్ నుంచి నివేదిక తీసుకున్న తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయని అధికారులు పేర్కొన్నారు.