జాతీయ జెండా కడుతూ అక్కడికక్కడే వ్యక్తి మృతి (వీడియో)
దిశ, వెబ్‌డెస్క్: దేశ వ్యాప్తంగా ప్రధాని పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
దిశ, వెబ్‌డెస్క్: దేశ వ్యాప్తంగా ప్రధాని పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై జాతీయ జెండాను ఎగుర వేస్తూ, సోషల్ మీడియాలో డీపీలుగా జాతీయ జెండా ఫొటోలను పెట్టి తమతమ దేశ భక్తిని చాటుకుంటున్నారు. అయితే ఈ కార్యక్రమాల్లో భాగంగా ఓ వ్యక్తి తన ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని కడుతూ కరెంట్ షాక్‌తో మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ వీడియోలో బాధితుడు తన ఇంటి బంగ్లా పై జాతీయ జెండా కడుతూ అక్కడిక్కడే మృతి చెందినట్లు కనిపిస్తుంది. ఆ వీడియోలో పక్కనే కరెంట్ స్థంభం కనిపించడంతో పొరపాటున కరెంట్ తీగలకు తగిలి ఉండవచ్చు లేదా ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఏర్పడిన తడి వల్ల అతనికి కరెంట్ షాక్ కొట్టి ఉండొచ్చని నెటిజన్లు భావిస్తున్నారు. ఏది ఏమైనా ఈ ఘటన అత్యంత విషాదకరమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఒక్కరు జాతీయ జెండాను కట్టే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. లేదంటే ప్రమాదం జరగవచ్చని సూచనలు చేస్తున్నారు.