ప్రధాని విషనాగు కామెంట్స్‌పై మల్లికార్జున ఖర్గే క్లారిటీ..
ప్రధాని నరేంద్ర మోడీ విషనాగు లాంటి వాడని అభివర్ణిస్తూ తాను చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నుంచి విమర్శలు వ్యక్తం అవుతుండటంతో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున వివరణ ఇచ్చారు.
దిశ, డైనమిక్ బ్యూరో: ప్రధాని నరేంద్ర మోడీ విషనాగు లాంటి వాడని అభివర్ణిస్తూ తాను చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నుంచి విమర్శలు వ్యక్తం అవుతుండటంతో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున వివరణ ఇచ్చారు. ఈ విషయంలో తన వ్యాఖ్యల ఉద్దేశం మోడీని వ్యక్తిగతంగా విమర్శించడం కాదని స్పష్టం చేశారు. బీజేపీ సిద్ధాంతం పాము లాంటిదనే ఉద్దేశంతోనే తాను ఆ వ్యాఖ్యలు చేసినట్లు చెప్పారు. కర్నాటకలోని కలబుర్గిలో ఎన్నికల ప్రచారంలో భాగంగా మాట్లాడిన ఖర్గే.. నరేంద్ర మోదీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో ప్రధానిని విషనాగుగా అభివవర్ణించారు. అయితే ఖర్గే వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర స్థాయిలో రియాక్ట్ అయింది.
కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ స్పందిస్తూ ఖర్గే వ్యాఖ్యలు గతంలో యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ మోడీపై చేసిన 'మౌత్ కా సౌదాగర్' వ్యాఖ్యల కంటే దారుణంగా ఉన్నాయని ధ్వజమెత్తారు. ప్రధానిపై చేసిన వ్యాఖ్యలకు గాను ఖర్గే క్షమాపణలు చెప్పాలని బీజేపీ నేత కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే డిమాండ్ చేశారు. మోడీని ప్రపంచం అంతా ప్రశంసిస్తుంటే అలాంటి వ్యక్తిపై ఇలాంటి పదజాలం వాడటం కాంగ్రెస్ దిగజారుడుకు నిదర్శనం అని దుయ్యబట్టారు.
Also Read..