Muizzu :అది ‘అనూహ్య విషాదం’.. మాల్దీవుల అధ్యక్షుడి సంతాప సందేశం

దిశ, నేషనల్ బ్యూరో : కేరళలోని వయనాడ్ జిల్లాలో ఉన్న పలు ప్రాంతాల్లో క్లౌడ్ బరస్ట్‌ కారణంగా కొండచరియలు విరిగిపడి చోటుచేసుకున్న విషాద ఘటనలపై మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Update: 2024-07-31 13:27 GMT
Muizzu :అది ‘అనూహ్య విషాదం’.. మాల్దీవుల అధ్యక్షుడి సంతాప సందేశం
  • whatsapp icon

దిశ, నేషనల్ బ్యూరో : కేరళలోని వయనాడ్ జిల్లాలో ఉన్న పలు ప్రాంతాల్లో క్లౌడ్ బరస్ట్‌ కారణంగా కొండచరియలు విరిగిపడి చోటుచేసుకున్న విషాద ఘటనలపై మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చనిపోయిన వారి కుటుంబాలకు తమ దేశ ప్రజల తరఫున ప్రగాఢ సంతాపాన్ని తెలుపుతూ ఆయన ఓ సందేశాన్ని భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీకి పంపారు. ఈ విపత్తు కారణంగా సంభవించిన భారీ ప్రాణనష్టాన్ని 'అనూహ్య విషాదం'గా ముయిజ్జు అభివర్ణించారు. సంఘటనా స్థలంలో రెస్క్యూ ఆపరేషన్ సాధ్యమైనంత వేగంగా పూర్తవుతుందని, బాధితులకు అన్ని రకాల సహాయ సహకారాలు అందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కష్టకాలాన్ని బాధిత కుటుంబాలు ధైర్యంగా అధిగమిస్తాయని తాను భావిస్తున్నట్లు తెలిపారు.

Tags:    

Similar News