ఉద్దవ్ ఠాక్రేపై సంచలన ఆరోపణలు చేసిన బిజీపీ నేత

శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ ఠాక్రేపై సంచలన ఆరోపణలు చేశారు మహారాష్ట్ర బీజేపీ అధినేత చంద్రశేఖర్ బవాన్‌కులే.

Update: 2024-08-11 11:01 GMT

దిశ, వెబ్ డెస్క్ : శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ ఠాక్రేపై సంచలన ఆరోపణలు చేశారు మహారాష్ట్ర బీజేపీ అధినేత చంద్రశేఖర్ బవాన్‌కులే. ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చంద్రశేఖర్ మాట్లాడుతూ.. మహారాష్ట్ర ప్రజలు ఉద్దవ్ ఠాక్రేకు తప్పకుండా బుద్ది చెప్తారని మండిపడ్డారు. ఉద్దవ్ బీజేపీని వదిలినందుకు తగిన గుణపాఠం ప్రజలే నేర్పిస్తారని తెలిపిన చంద్రశేఖర్.. కేవలం బీజేపీని మాత్రమే కాదు, ఛత్రపతి శివాజీ మహరాజ్ వారసత్వాన్ని కూడా వదిలేశారని, దీనిని ప్రజలు గమనిస్తూనే ఉన్నారని పేర్కొన్నారు. కాగా శనివారం థానేలో ఉద్దవ్ ఠాక్రే శివసేన కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ.. మహా సీఎం ఏక్‌నాథ్ షిండే కేంద్ర ప్రభుత్వం ముందు మోకరిల్లుతున్నారని ఆరోపించారు. ఈ క్రమంలోనే బీజేపీ అధినేత చంద్రశేఖర్ బవాన్‌కులే మీడియా సమావేశంలో ఉద్దవ్ ఠాక్రేపై నిప్పులు చెరిగారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలు కేవలం ఎన్నికలు మాత్రమే కావని, రాష్ట్రాన్ని, రాష్ట్ర వారసత్వాన్ని ద్వేషించే వారిపై పోరాటమని అన్నారు. వచ్చే అక్టోబర్ లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగున్న నేపథ్యంలో ఆ రాష్ట్రంలో రాజకీయ వేడి రాజుకుంటోంది.  


Similar News