ఐదేళ్ల క్రితం అదృశ్యం.. పాక్ జైల్లో ప్రత్యక్షం
మధ్యప్రదేశ్‌లో కనిపించకుండా పోయిన 44 ఏళ్ల వ్యక్తి ఐదేళ్ల తర్వాత తిరిగొచ్చాడు.
భోపాల్: మధ్యప్రదేశ్‌లో కనిపించకుండా పోయిన 44 ఏళ్ల వ్యక్తి ఐదేళ్ల తర్వాత తిరిగొచ్చాడు. సరిహద్దు దాటినందుకు పాకిస్తాన్ జైళ్లో ఇంతకాలం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇందవాడీకి చెందిన రాజు పిండారే స్వదేశానికి తిరిగి వచ్చినట్లు సోమవారం అధికారులు తెలిపారు. పాకిస్తాన్ అధికారుల నుంచి సమాచారంతో పంజాబ్ అమృత్‌సర్ వెళ్లిన నలుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక బృందం ఆయనను తీసుకొచ్చింది. అమృత్ సర్ రెడ్‌క్రాస్ సొసైటీ ద్వారా వ్యక్తి సమాచారం భారత్‌కు చేరినట్లు అదనపు కలెక్టర్ శంకర్‌లాల్ సింఘడే చెప్పారు.
చట్టపరమైన లాంఛనాలు పూర్తైన తర్వాత కుటుంబ సభ్యులకు అప్పగించనున్నట్లు తెలిపారు. ఈ నెల 14న పాక్ అధికారులు అంతర్జాతీయ సరిహద్దు పిండారేను ఖాండ్వా పోలీసులకు అప్పగించారు. పోలీసులతో తాము టచ్‌లో ఉన్నామని శంకర్‌లాల్ చెప్పారు. పిండారే ఆరోగ్యం మానసికంగా బాలేదని, పాకిస్తాన్ ఎలా వెళ్లాడో అర్థం కావట్లేదని అతని తల్లి చెప్పింది. తమది నిరుపేద కుటుంబమని, గుఢాచర్యం చేసే అవకాశం కూడా లేదని తెలిపింది.