Lucknow: యూపీలో దారుణం.. ఐఫోన్ కోసం డెలివరీ బాయ్‌ని హత్య చేసిన నిందితులు
ఐఫోన్ కోసం ఆన్‌లైన్ డెలివరీ బాయ్ ను హత్య చేసిన దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది.
దిశ, డైనమిక్ బ్యూరో: ఐఫోన్ కోసం ఆన్‌లైన్ డెలివరీ బాయ్‌ను హత్య చేసిన దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఘటన ప్రకారం లక్నోలోని చిన్‌హట్ ప్రాంతంలో నివాసం ఉంటున్న గజానన్ అనే వ్యక్తి ప్రముఖ ఆన్‌లైన్ డెలివరీ ప్లాట్‌ఫాం ఫ్లిప్‌కార్ట్ నుంచి లక్షా 50 వేల విలువైన ఐఫోన్ క్యాష్ ఆన్ డెలివరీ ద్వారా ఆర్డర్ చేశారు. ఫ్లిప్‌కార్ట్ ఏజెంట్ గా పని చేస్తున్న భరత్ సాహు అనే వ్యక్తి ఐఫోన్ డెలివరీ చేసేందుకు గజానన్ ఇంటికి వెళ్లాడు. అక్కడ గజానన్ అతడి స్నేహితుడితో కలిసి ఐఫోన్ కోసం డబ్బు చెల్లించకుండా డెలివరీ ఏజెంట్‌ని హత్య చేశారు. భరత్ గొంతుకోసి గోనె సంచిలో కట్టి, ఇందిరా కాలువలో పడేశారు.
రెండు రోజులుగా భరత్ ఇంటికి రాకపోవడంతో అతని భార్య చిట్‌హన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ జరిపిన పోలీసులు చివరగా అతడితో మాట్లాడిన గజానన్ నంబర్ ను ట్రేస్ చేసి అతడి స్నేహితుడు ఆకాశ్‌ని అదుపులోకి తీసుకున్నారు. ఆకాశ్ ను విచారించగా నేరాన్ని అంగీకరించాడు. ఐఫోన్ డెలివరీ చేశాక భరత్ ను హత్య చేసినట్లు ఒప్పుకున్నాడని డీసీపీ శశాంక్ సింగ్ తెలిపారు. అనంతరం గజానన్‌ను కూడా అదుపులోకి తీసుకున్నామని, డెలివరీ బాయ్ మృతదేహాన్ని కనుగొనడానికి ఎస్‌డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయని డీసీపీ వెల్లడించారు.