2009లో సైన్యం కాల్పుల్లో మృతి చెందిన 'ఎల్టీటీఈ ప్రభాకరన్ ఇంకా బతికే ఉన్నాడు..

ఎల్టీటీఈ (లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం) చీఫ్ వేలుపిళ్లై ప్రభాకరన్ ఇంకా సజీవంగానే ఉన్నారా? ఆయన ఎన్కౌంటర్ అయ్యారని ప్రభుత్వం ప్రకటించిన 14 ఏళ్ల తర్వాత ఈ విషయం మరోసారి సంచలనంగా మారింది.

Update: 2023-02-13 08:48 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ఎల్టీటీఈ (లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం) చీఫ్ వేలుపిళ్లై ప్రభాకరన్ ఇంకా సజీవంగానే ఉన్నారా? ఆయన ఎన్కౌంటర్ అయ్యారని ప్రభుత్వం ప్రకటించిన 14 ఏళ్ల తర్వాత ఈ విషయం మరోసారి సంచలనంగా మారింది. ప్రభాకరన్ ఇంకా బతికే ఉన్నాడని తమిళ జాతీయవాద నాయకుడు పజా నెడుమారన్ సోమవారం చేసిన వ్యాఖ్యలు తమిళనాట దుమారం రేపుతున్నాయి. ప్రభాకరన్ ఇంకా బతికే ఉన్నాడని ఆయనతో తాను ఇప్పటికీ టచ్‌లో ఉన్నానని నెడుమారన్ చెప్పడం హాట్ టాపిక్ అయింది.

ప్రభాకరన్ అనుమతితోనే తాను ఈ విషయాన్ని ప్రకటిస్తున్నానని ప్రభాకరన్‌తో పాటు ఆయన భార్య కూతురు కూడా క్షేమంగానే ఉన్నారని చెప్పుకొచ్చారు. త్వరలోనే ప్రభాకరన్ ప్రజల ముందుకు వస్తారని చెప్పారు. శ్రీలంకలోని తమిళులకు మద్దతుగా అనేక దశాబ్దాల పాటు ఉద్యమం ప్రభాకరన్ నడిపాడు. ఆత్మాహుతి దళాలను తయారు చేసి లంక ప్రభుత్వంతో యుద్ధం కొనసాగించాడు.

భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యలోనూ ఈ ఎల్టీటీఈయేనే ప్రధాన పాత్ర పోషించింది. ఈ క్రమంలో లంక ప్రభుత్వానికి ఎల్టీటీఈ దళాలకు మధ్య హోరాహోరీ వార్ కొనసాగింది. ఈ క్రమంలో 2009 మే 18న ప్రభాకరన్ ను శ్రీలంక సైన్యం ఎన్ కౌంటర్ చేసినట్లు ప్రకటించింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను సైతం విడుదల చేసింది. ప్రభాకరన్‌మృతదేహాన్ని ఎల్టీటీఈ సంస్థ మాజీ నాయకుడు కరుణ అమ్మన్ అప్పట్లో గుర్తించారు.

దీంతో ప్రభాకరన్ వ్యవహారం అంతా సైలెంట్ అయిపోయింది. ఈ నేపథ్యంలో ప్రభాకరన్ ఇంకా సజీవంగానే ఉన్నాడంటూ పజా నెడుమారన్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి. అయితే ప్రభాకరన్ ఫోటోలను లంక సైన్యం బయట పెట్టడం, ఆయన ఎన్ కౌంటర్ తర్వాత ఎల్టీటీఈ కార్యకలాపాలు తగ్గిపోవడంతో నెడమారన్ మాటలను ఎంత మంది విశ్వసిస్తారనేది చర్చగా మారింది.

Tags:    

Similar News