Parliament Session: రైతులను పార్లమెంటులోకి రానివ్వలేదు- రాహుల్ గాంధీ

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పార్లమెంట్ కాంప్లెక్స్‌లో రైతులతో సమావేశం అయ్యారు. పార్లమెంట్‌లోని రాహుల్ గాంధీ ఛాంబర్‌లో ఈ భేటీ కొనసాగుతోంది.

Update: 2024-07-24 08:38 GMT

దిశ, నేషనల్ బ్యూరో: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పార్లమెంట్ కాంప్లెక్స్‌లో రైతులతో సమావేశం అయ్యారు. పార్లమెంట్‌లోని రాహుల్ గాంధీ ఛాంబర్‌లో ఈ భేటీ కొనసాగుతోంది. అయితే ఈ భేటీ ఇప్పటికే చర్చనీయాంశమైంది. తనను కలిసేందుకు వచ్చిన రైతులను పార్లమెంటులోకి అనుమతివ్వలేదని ఆరోపించారు. వారిని తన కార్యాలయానికి తానే ఆహ్వానించినట్లు వెల్లడించారు. రైతులు కావడం వల్లే వారిని వారిని లోనికి అనుమతించలేదన్నారు. అయితే ఈ విషయం మీడియా ముందుకు రావడంతో రాహుల్‌ను కలిసేందుకు రైతులను అనుమతించారు.

రైతులతో రాహుల్ భేటీ

ఇకపోతే, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో 12 మంది సభ్యులతో కూడిన రైతు ప్రతినిధుల బృందం పార్లమెంటు భవనంలో భేటీ అయ్యింది. ఈ బృందంలో పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన నేతలు ఉన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ ఎంపీలు రాజా బరార్, సుఖ్‌జీందర్ సింగ్ రంధావా, గుర్జీత్ సింగ్ ఔజ్లా, ధరమ్‌వీర్ గాంధీ, దీపేందర్ సింగ్ హుడా, జై ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.


Similar News