ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లుకు లోక్ సభలో ఆమోదం
ఢిల్లీలో చట్టాలు చేసే అధికారం కేంద్రానికి కల్పించాలని కేంద్రం ప్రవేశపెట్టిన ‘ఢిల్లీ ఆర్డినెన్స్’ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది.
దిశ, వెబ్ డెస్క్: ఢిల్లీలో చట్టాలు చేసే అధికారం కేంద్రానికి కల్పించాలని కేంద్రం ప్రవేశపెట్టిన ‘ఢిల్లీ ఆర్డినెన్స్’ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లుని మంగళవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రవేశపెట్టగా.. ఈ రోజు దీనికి ఆమోదం తెలుపుతూ స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. ఇక ఈ బిల్లును వ్యతిరేకిస్తూ ఇండియా కూటమితో పాటు ఇతర పార్టీలకు చెందిన పలువురు ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు.
ఈ క్రమంలోనే వారు సభ నుంచి వాకౌట్ చేశారు. అనంతరం పార్లమెంట్ ఆవరణలో కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బిల్లు కాపీని చించి కుర్చీ వైపు విసిరిన ఆప్ సభ్యుడు సుశీల్ కుమార్ రింకూను ఈ సమావేశాలు పూర్తయ్యేవరకు సభ నుంచి సస్పెండ్ చేశారు.