పెళ్లి వేడుకలో రిటర్న్ గిఫ్ట్స్‌గా మద్యం బాటిళ్లు.. ఫుల్ ఖుష్ అయిన బంధువులు

పెళ్లీళ్లు, గృహప్రవేశాలు, పుట్టిరోజు వంటి కార్యక్రమాలు గ్రాండ్‌గా నిర్వహిస్తారు. ఏదైనా శుభకార్యాలకు హాజరైన వారు కానుకలు తీసుకుని వెళ్లడం కామన్.

Update: 2023-06-03 08:21 GMT

దిశ, వెబ్ డెస్క్: పెళ్లీళ్లు, గృహప్రవేశాలు, పుట్టిరోజు వంటి కార్యక్రమాలు గ్రాండ్‌గా నిర్వహిస్తారు. ఏదైనా శుభకార్యాలకు హాజరైన వారు కానుకలు తీసుకుని వెళ్లడం కామన్. అయితే ఈ కార్యక్రమానికి హాజరైన వారికి కూడా కొంత మంది రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడం ప్రస్తుతం ట్రెడింగ్‌గా మారింది. అయితే రిటర్న్‌ గిఫ్టులుగా వస్త్రమో, వస్తువో ఇవ్వడం సాధారణమే. కానీ ఇటీవల పుదుచ్చేరిలో ఓ పెళ్లివారు మాత్రం లిక్కర్‌ బాటిళ్లను రిటర్న్‌ గిఫ్టులుగా ఇచ్చి అందరినీ ఆశ్చర్యపర్చారు.

వివరాల్లోకి వెళితే.. సాధారణంగా శుభకార్యం జరిగినప్పుడు ఆ కార్యానికి వచ్చిన బంధుమిత్రులకు కొబ్బరికాయ, అరటిపండు, తమలపాకు, కుంకుమతో కూడిన తాంబూలం వంటివి ఇస్తుంటారు. కానీ, పుదుచ్చేరీలోని ఓ పెళ్లిలో లిక్కర్ బాళిళ్లు రిటర్న్ గిఫ్ట్స్‌గా ఇచ్చారు. అయితే బ్యాగ్ తెరిచి చూసుకున్న బంధువులు లిక్కర్ ఉండటాన్ని చూసి ఆశ్చర్యానికి గురవుతున్నారు. మరికొంత మంది మాత్రం ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో అది చూసిన నెటిజన్లు లిక్కర్ బాటిళ్లు ఇచ్చిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Tags:    

Similar News