స్మార్ట్ సిటీల వలె స్మార్ట్ విలేజీలు అవసరం
స్మార్ట్ సిటీల వలె దేశానికి స్మార్ట్ విలేజీలు కూడా అవసరమని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు.
న్యూఢిల్లీ: స్మార్ట్ సిటీల వలె దేశానికి స్మార్ట్ విలేజీలు కూడా అవసరమని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. శనివారం మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలోని సిన్నార్ తాలుకాలో దివంగత బీజేపీ నేత గోపినాథ్ ముండే విగ్రహాన్ని ఆయన అవిష్కరించారు. రైతుల న్యాయం కోసం ముండే ముందుండి పోరాడారని అన్నారు. కృష్ణ వ్యాలీ, తాపీ ఇరిగేషన్ పథకాలు, విదర్భ ఇరిగేషన్ ప్రాజెక్టుల ద్వారా రైతుల కోసం పనిచేశారని గడ్కరీ చెప్పారు.
ఆయన నాయకత్వాన్ని కొనసాగిస్తూ రైతుల పిల్లల కోసం పలు పథకాలు తీసుకొచ్చినట్లు చెప్పారు. స్మార్ట్ సిటీ ప్రాజెక్టుతో పాటు స్మార్ట్ విలేజీ కాన్సెప్ట్‌ను అమలు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ముండే ప్రజల నాయకుడని సీఎం ఏక్‌నాథ్ షిండే ప్రశంసల వర్షం కురిపించారు. తాజాగా వర్షాలతో నష్టపోయిన రైతులకు అవసరమైన సాయం అందిస్తామని హామీ ఇచ్చారు.