నేడు ఢిల్లీలో స్టాలిన్ అధ్యక్షతన విపక్షాల భేటీ

విపక్షాల ఐక్యతను ప్రదర్శించేందుకు డీఎంకే నేత, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ అధ్వర్యంలో.... Led By MK Stalin's DMK, Top Opposition Leaders To Meet In Delhi Tomorrow

Update: 2023-04-02 10:15 GMT

న్యూఢిల్లీ: విపక్షాల ఐక్యతను ప్రదర్శించేందుకు డీఎంకే నేత, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ అధ్వర్యంలో ప్రతిపక్షాలు మరోసారి భేటి కానున్నాయి. ఆలిండియా ఫెడరేషన్ ఆఫ్ సోషల్ జస్టిస్‌లో భాగంగా బీజేపీయేతర నేతలందరూ సోమవారం ఢిల్లీలో సమావేశం కానున్నారు. ఈ కార్యక్రమానికి రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లట్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ హజరుకానున్నారు. అయితే ప్రతిపక్ష ప్రధాని అభ్యర్థులుగా భావిస్తున్న బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్, తెలంగాణ సీఎం కేసీఆర్ వర్చువల్‌గా పాల్గొననున్నట్లు తెలిపారు. అయితే టీఎంసీ ఎంపీ డెరెక్ ఒబ్రెయిన్, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్, బీఆర్ఎస్ ఎంపీ కేశవ రావు సమావేశాల్లో నేరుగా పాల్గొనున్నారు. కాగా, విపక్షాల ఐక్యత కోసం డీఎంకే చేస్తున్న రెండో ప్రయత్నం ఇది కావడం గమనార్హం. అంతకుముందు స్టాలిన్ 70వ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని కాంగ్రెస్ చీఫ్ మల్లిఖార్జున్ ఖర్గే తేజస్వి యాదవ్, జమ్ముకశ్మీర్ నేత ఫరూఖ్ అబ్దుల్లా సమావేశమైన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News