వక్ఫ్ బిల్లుపై వెనక్కు తగ్గిన బీజేడీ

బీజేపీ ఎంపీ ముజిబుల్లా ఖాన్ రాజ్యసభలో ముస్లిం సమాజానికి ప్రాతినిధ్యం వహిస్తారని, బిల్లుకు సంబంధించిన అంశాలపై పార్టీ ఆందోళనలను వెల్లడిస్తారని అంతుక ముందు పేర్కొంది.

Update: 2025-04-03 16:35 GMT

- మనస్సాక్షి మేరకు ఓటేయమని ఎంపీలకు సూచన

- అంతకు ముందు వ్యతిరేకించాలని పిలుపు

దిశ, నేషనల్ బ్యూరో: వక్ఫ్ సవరణ బిల్లుపై బీజూ జనతాదళ్ (బీజేడీ) వెనక్కు తగ్గింది. గతంలో వక్ఫ్ బిల్లును రాజ్యసభలో అడ్డుకోవాలని తన పార్టీ ఎంపీలకు పిలుపునిచ్చిన పార్టీ.. గురువారం రూటు మార్చింది. రాజ్యసభలో తమ సభ్యులు తమ మనస్సాక్షి మేరకు ఓటు వేస్తారని చెప్పింది. మైనార్టీ వర్గాల మనోభావాలను పరిగణలోకి తీసుకున్నామని, ఆ తర్వాతే నిర్ణయం తీసుకున్నట్లు బీజేడీ పేర్కొంది. వక్ఫ్ సవరణ బిల్లు బుధవారం లోక్‌సభలో ఆమోదం పొందింది. అయితే ఆ పార్టీకి లోక్‌సభలో సభ్యులు లేరు. కానీ రాజ్యసభలో మాత్రం ఏడుగురు ఎంపీలు ఉన్నారు. వీరందరూ వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేస్తారని గతంలో బీజేడీ చెప్పింది. అయితే ఈ ప్రకటనపై వెనక్కు తగ్గుతున్నట్లు పార్టీ ప్రతినిధి సస్మిత్ పాత్ర గురువారం ట్వీట్ చేశారు. బిల్లు ఓటింగ్‌కు వస్తే అన్ని వర్గాల హక్కుల కోసం వారి మనస్సాక్షిని ఉపయోగించుకునే బాధ్యతను పార్టీ సభ్యులకు అప్పగిస్తున్నట్లు తెలిపారు. రాజ్యసభలో పార్టీ ఎలాంటి విప్ జారీ చేయడం లేదని పేర్కొంది.

బీజేడీ ఎంపీ ముజిబుల్లా ఖాన్ రాజ్యసభలో ముస్లిం సమాజానికి ప్రాతినిధ్యం వహిస్తారని, బిల్లుకు సంబంధించిన అంశాలపై పార్టీ ఆందోళనలను వెల్లడిస్తారని అంతుకు ముందు పేర్కొంది. కానీ ఇప్పుడు ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. ఒడిషాలో బీజేపీకి ప్రధాన ప్రత్యర్థిగా బీజేడీ ఉన్నప్పటికీ.. గతంలో పలు సందర్బాల్లో ఎన్డీయే పార్టీకి పార్లమెంటులో మద్దతు ఇచ్చింది. జమ్ము కశ్మీర్ రీఆర్గనైజేషన్ బిల్లు, ముస్లిం హహిళల వివాహ హక్కుల రక్షణ బిల్లు, ఉపా చట్టం, ఆర్టీఐ చట్టం సవరణల బిల్లులకు బీజేడీ మద్దతు పలికింది.

ఇద్దరు జేడీయూ నాయకులు రాజీనామా

వక్ష్ సవరణ బిల్లుకు జేడీ(యూ) మద్దతు ఇచ్చినందుకు గాను ఇద్దరు నాయకులు ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు గురువారం ప్రకటించారు. జేడీయూ ఒక లౌకిక పార్టీ అనే ముస్లింల పట్ల విశ్వాసాన్ని కోల్పోయామని పేర్కొంటూ మొహమ్మద్ ఖాసీ అన్సారీ, మొహమ్మద్ నవాజ్ మాలిక్‌లు సీఎం నితీశ్ కుమార్‌కు వేర్వేరుగా రాజీనామా లేఖలు పంపించారు. నా జీవితంలో ఇన్నేళ్లు పార్టీ కోసం పని చేసినందుకు ఇవ్వాళ అసంతృప్తిగా ఉందని అన్సారీ పేర్కొన్నారు. వక్ఫ్ బిల్లు రాజ్యాంగంలో పేర్కొన్న అనేక ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తోందని మాలిక్ చెప్పారు.

Tags:    

Similar News