బీహార్‌లో మళ్లీ మోగిన ఆ పాట.. లాలూ కూమార్తె ట్వీట్ (వీడియో)
"పట్టాభిషేకానికి సిద్ధం చేయండి. లాంతరు వాహకాలు వస్తున్నాయి" Lalu Yadav’s daughter Rohini Acharya's tweet has gone viral.
దిశ, వెబ్‌డెస్క్ః మరో రెండేళ్లలో భారతదేశంలో సాధారణ ఎన్నికలు వస్తుండగా, దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో రాజకీయ సమీకరణలు ఊహించని రీతిలో మలుపులు తిరుగుతున్నాయి. ఇందులో భాగంగానే బీహార్‌లో నితీష్ కుమార్ మరోసారి బిజెపితో విడిపోయి, లాలూ ప్రసాద్ యాదవ్‌కు చెందిన ఆర్‌జెడితో పొత్తు పెట్టుకోవాలని నిర్ణయించుకున్నాడు. సరిగ్గా, ఈ పరిణామానికి కొన్ని గంటల ముందు, అతని కుమార్తె రోహిణి ఆచార్య సోమవారం "పట్టాభిషేకానికి సిద్ధం చేయండి. లాంతరు వాహకాలు వస్తున్నాయి" అని ఆచార్య హిందీలో ట్వీట్ చేశారు. లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ రాష్ట్రీయ జనతా దళ్ (RJD) ఎన్నికల గుర్తు లాంతరు కాగా, ఇప్పుడు ఆ పార్టీకి ఆయన చిన్న కుమారుడు తేజస్వి యాదవ్ నాయకత్వం వహిస్తున్నారు.
ఇక, లాలూ కుమార్తె ఈ పోస్ట్‌తో పాటు, ఆమె భోజ్‌పురి పాటను కూడా ట్వీట్ చేశారు. "లాలూ బిన్ చాలూ ఈ బీహార్ నా హోయీ (లాలూ లేకుండా బీహార్ నడవదు)." అని ఆమె చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. ఇప్పటివరకు లక్షల్లో వీక్షణలు, వేలకి వేలు లైక్‌లు, రీట్వీట్‌లు వస్తున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో బీహార్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎన్నికలకు ముందు విడుదలైన ఈ పాటను ప్రముఖ భోజ్‌పురి గాయకుడు-నటుడు ఖేసరీ లాల్ యాదవ్ పాడారు. ఈ పాట ఒక RJD అభ్యర్థి కోసం తయారు చేసినప్పటికీ, అది మాజీ ముఖ్యమంత్రి లాలూని, అతని రాజకీయ వారసుడు తేజశ్వీని ప్రశంసించే పంక్తులతో ఉంటుంది. "తేజశ్వి కే బినా సుధార్ నా హోయీ (తేజశ్వి లేకుండా పురోగతి ఉండదు)" అని కూడా పాటలో ఉంటుంది.
"राजतिलक की करो तैयारी आ रहे हैं , लालटेन धारी "✌️ pic.twitter.com/R0pYeaU2mN
— Rohini Acharya (@RohiniAcharya2) August 9, 2022