కాంగ్రెస్ ప్రభుత్వానికి శుభాకాంక్షలు.. ఫలితాలపై కుమారస్వామి కీలక వ్యాఖ్యలు

కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు జేడీఎస్‌కు భారీ షాకిచ్చాయి. జేడీఎస్ కంచుకోట అయిన స్థానాల్లో సైతం ఈ సారి ఆ పార్టీకి ఘోర పరాభవం ఎదురైంది.

Update: 2023-05-13 08:32 GMT

దిశ, వెబ్‌డెస్క్: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు జేడీఎస్‌కు భారీ షాకిచ్చాయి. జేడీఎస్ కంచుకోట అయిన స్థానాల్లో సైతం ఈ సారి ఆ పార్టీకి ఘోర పరాభవం ఎదురైంది. కర్నాటకలో ఈ సారి జేడీఎస్ కింగ్ మేకర్ అవుతుందన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తలకిందులయ్యాయి. జేడీఎస్ గత ఎన్నికల్లో కంటే ఈ సారి పరాజయం చవిచూసింది. భారీగా ఓట్ షేర్‌ను కోల్పోవడంతో పాటు సీట్లను సైతం కోల్పోయింది. ఏకంగా జేడీఎస్ కీలక నేత, మాజీ సీఎం కుమారస్వామి కొడుకు నిఖల్ కుమారస్వామి సైతం ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. జేడీఎస్ ఓట్లకు ఈ సారి కాంగ్రెస్ పార్టీ భారీగా గండికొట్టింది.

జేడీఎస్ ఓట్ షేర్ కాంగ్రెస్‌కు మళ్లడంతో కర్నాటకలో హస్తం పార్టీ ప్రభుత్వ ఏర్పాటు దిశగా సాగుతోంది. ఇదిలా ఉండగా.. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కుమారస్వామి స్పందించారు. ఎన్నికల్లో ఓటర్లు ఇచ్చిన ప్రజాతీర్పును గౌరవిస్తున్నామన్నారు. కర్నాటకలో కొత్తగా ఏర్పడే ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే కాంగ్రెస్‌ను ప్రజాసమస్యలు పరిష్కారించాలని కోరుతున్నానని అన్నారు. జేడీఎస్ అభ్యర్థులకు మద్దతు తెలిపి గెలిపించిన ప్రజలకు ఈ సందర్భంగా కుమారస్వామి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలోని ప్రజాసమస్యలపై జేడీఎస్ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని పేర్కొన్నారు. ఇక, చెన్నపట్న నియోజకవర్గం నుండి బరిలోకి దిగిన కుమారస్వామి కాంగ్రెస్ అభ్యర్థిపై విజయం సాధించారు. 

Read More...    కర్ణాటకలో కాంగ్రెస్ విజయ దుందుభి 

Tags:    

Similar News