Kolkata doctor rape-murder case : ఈ కేసులో ఆమె ఏ పనీ చేయలేదు.. దీదీపై బాధితురాలి తండ్రి ఘాటు వ్యాఖ్యలు

కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచారం(Kolkata doctor rape-murder case) కేసులో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయ

Update: 2024-09-11 05:25 GMT

దిశ, నేషనల్ బ్యూరో: కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచారం(Kolkata doctor rape-murder case) కేసులో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, బాధితురాలి తండ్రి కన్నీళ్లు పెట్టుకున్న వీడియో వైరల్ గా మారింది. అందులో ట్రైనీ డాక్టర్ తండ్రి సీఎం మమతా బెనర్జీపై(West Bengal chief minister Mamata Banerjee) సంచలన ఆరోపణలు చేశారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ కేసు విషయంలో ప్రవర్తించిన తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘ఈ కేసులో సీఎం (మమతా బెనర్జీ) పాత్రపై మాకు సంతృప్తి లేదు. ఆమె ఏ పనీ చేయలేదు. ఈ కేసులో డిపార్ట్‌మెంట్‌కు చెందిన వ్యక్తి ప్రమేయం ఉందని మేం ముందునుంచి చెప్తూనే ఉన్నాం. ఈసారి దుర్గాపూజా ఎవరూ జరుపుకోరని మేం భావిస్తున్నాం. ఎవరైనా సంబురాలు జరుపుకున్న వారు ఆనందంగా చేసుకోలేరు. ఎందుకంటే, బెంగాల్ ప్రజలే కాదు.. దేశమంతా నా కూతురిని తమ కూతురిగా భావిస్తోంది’ అని ఆవేదన వ్యక్తం చేశారు.

దీదీపై బాధితురాలి తల్లి ఆరోపణలు

ఇకపోతే, బాధితురాలి తల్లి మమతా బెనర్జీపై ఆరోపణలు గుప్పించారు. బాధితురాలి తల్లి మాట్లాడిన ఒకరోజుకే ఆమె భర్త కూడా దీదీపై ఆరోపణలు గుప్పించారు. "మేం మా కూతురితో కలిసి దుర్గాపూజ జరుపుకుంటాము. కానీ రాబోయే సంవత్సరాల్లో మేము దుర్గాపూజ లేదా మరే ఇతర పండుగను జరుపుకోం. మమతా బెనర్జీ వ్యాఖ్యలు అనుచితమైనవి. ఆమె మా కుమార్తెను తిరిగి ఇవ్వనివ్వండి. తన కుటుంబంలో ఇలాంటి ఘటన జరిగితే ఆమె ఇలాగే మాట్లాడి ఉండేదా?’’ అని బాధితురాలి తల్లి ఆరోపించారు. "నా ఇంట్లోని దీపం ఆరిపోయింది. వారు నా కూతురిని చంపేశారు. ఇప్పుడు న్యాయం కోసం చేస్తున్న డిమాండ్‌ను అణచివేయడానికి ప్రయత్నిస్తున్నారు.” అని దీదీపై విరుచుకుపడ్డారు. సోమవారం బెంగాల్ సచివాలయంలో జరిగిన సమావేశంలో దీదీ మాట్లాడుతూ.. నిరనసల నుంచి దుర్గాపూజ ఉత్సవాలపై దృష్టి మళ్లించాలని ప్రజలను కోరారు. సీబీఐ (CBI) దర్యాప్తును త్వరగా పూర్తి చేయాలని కోరారు. దీనిపైనే బాధితురాలి తల్లిదండ్రులు విరుచుకుపడ్డారు.


Similar News