Kolkata Doctor Rape Murder: డాక్టర్ల నిరసనల వల్ల 23 మంది చనిపోయారు.. సుప్రీంకోర్టుకు దీదీ సర్కారు వెల్లడి

కోల్ కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార(Kolkata Doctor Rape Murder) ఘటనపై సుప్రీంకోర్టుకు పశ్చిమ బెంగాల్(West Bengal) ఆరోగ్యశాఖ కోర్టులో నివేదిక సమర్పించింది.

Update: 2024-09-09 07:24 GMT

దిశ, నేషనల్ బ్యూరో: కోల్ కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార(Kolkata Doctor Rape Murder) ఘటనపై సుప్రీంకోర్టుకు పశ్చిమ బెంగాల్(West Bengal) ఆరోగ్యశాఖ కోర్టులో నివేదిక సమర్పించింది. బెంగాల్ లో డాక్టర్ల నిరసనల వల్ల సరైన టైంకి వైద్యం అందక ఇప్పటివరకు 23 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపింది. ఈ విషయాన్ని పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపిస్తున్నసీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ తెలిపారు. అయితే, తనకు నివేదిక అందలేదని సొలిసిటర్ జనరల్ తెలిపారు. సీల్డ్ కవర్‌లో సమర్పించిన నివేదికను సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం సమీక్షించింది.

బెంగాల్ ప్రభుత్వంపై కేంద్రం ఆరోపణలు

ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌(RG Kar Hospital)లో భద్రతకు బాధ్యత వహిస్తున్న సీఐఎస్‌ఎఫ్‌కు లాజిస్టికల్ సపోర్ట్ అందించడంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం విఫలమైందని సుప్రీంకోర్టుకు కేంద్రం వెల్లడించింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఉన్నత న్యాయస్థానానికి అందజేసిన దరఖాస్తులో తృణమూల్ కాంగ్రెస్ (TMC) ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అందలేదని తెలిపింది. సీఐఎస్ఎఫ్ కు పూర్తి మద్దతునిచ్చేలా రాష్ట్ర అధికారులను ఆదేశించాలని అభ్యర్థించింది.


Similar News