Kolkata: కోల్‌కతా హత్యాచారం కేసులో వెలుగులోకి ‘డోర్‌ బోల్ట్‌’ వ్యవహారం

కోల్‌కతా హత్యాచారం కేసులో సీబీఐ తన దర్యాప్తును వేగవంతం చేసింది

Update: 2024-08-23 14:23 GMT

దిశ, నేషనల్ బ్యూరో: కోల్‌కతా హత్యాచారం కేసులో సీబీఐ తన దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ ఘటనకు సంబంధించిన ప్రతి అంశాన్ని నిశితంగా పరిశీలిస్తోంది. ఈ నేపథ్యంలో నేరం జరిగిన సెమినార్ హాల్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేసింది. దీనిలో భాగంగా సెమినార్ హాల్‌ డోర్‌ బోల్ట్‌ విరిగినట్లు సీబీఐ గుర్తించింది. దీంతో నేరం జరుగుతుండగా ఎవరూ లోపలికి రాకుండా చూడటానికి హాల్‌ బయట నిల్చొని ఎవరైనా సహకరించారా అని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. డాక్టర్లు, ఇంటర్న్‌లు, జూనియర్ డాక్టర్‌లను విచారించినప్పుడు చాలా కాలంగా డోర్ బోల్ట్ పనిచేయట్లేదని తెలిపారు. ఈ నేపథ్యంలో నిందితుడికి కాపాలాగా హాల్ బయట ఎవరైనా సహకరించారా అని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు

బాధితురాలిపై దాడి జరుగుతున్నప్పుడు లోపల నుంచి వచ్చిన సౌండ్స్ ఎవరికి వినిపించకపోవడంపై కూడా దర్యాప్తు అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. బాధితురాలు ఆగస్టు 9న తెల్లవారుజామున 2 గంటల నుంచి 3 గంటల మధ్య హాల్‌లోకి ప్రవేశించిందని డ్యూటీలో ఉన్న ఒక వైద్యుడు ఆమెను చూశాడని ఒక అధికారి తెలిపారు. విచారణలో భాగంగా, ముగ్గురు జూనియర్ డాక్టర్లతో సహా ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లోని నలుగురు ఉద్యోగులకు సీబీఐ పాలిగ్రాఫ్ పరీక్షలు నిర్వహిస్తుంది.

Tags:    

Similar News