Kolkata : వైద్యురాలు సూసైడ్ వల్లే చనిపోయిందని బుకాయించిన ఆస్పత్రి అధికారి.. దర్యాప్తులో గుర్తింపు
దిశ, నేషనల్ బ్యూరో : పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీ హాస్పిటల్‌కు చెందిన జూనియర్ వైద్యురాలి హత్య, అత్యాచారం వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది.
దిశ, నేషనల్ బ్యూరో : పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీ హాస్పిటల్‌కు చెందిన జూనియర్ వైద్యురాలి హత్య, అత్యాచారం వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ వ్యవహారంలో ముగ్గురు జూనియర్ డాక్టర్లు, ఒక హౌజ్ స్టాఫ్‌కు కోల్‌కతా పోలీసులు సోమవారం సమన్లు జారీ చేశారు. జూనియర్ వైద్యురాలితో పాటు ఈ నలుగురు కూడా గత గురువారం (ఆగస్టు 8న) రాత్రి హాస్పిటల్‌లో డ్యూటీ చేసినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ఆగస్టు 9న ఆస్పత్రిలోని సెమినార్ హాల్‌లో జూనియర్ వైద్యురాలు విగత జీవిగా కనిపించింది. ఇక ఈ కేసు దర్యాప్తులో మరో ముఖ్యమైన అంశం కూడా వెలుగులోకి వచ్చింది.
జూనియర్ వైద్యురాలు ఆత్మహత్య చేసుకొని చనిపోయారని ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీ హాస్పిటల్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ మృతురాలి కుటుంబ సభ్యులకు చెప్పారని వెల్లడైంది. దీనిపై మరిన్ని వివరాలను సేకరించేందుకు హాస్పిటల్ అసిస్టెంట్ సూపరింటెండెంట్‌తో పాటు చెస్ట్ మెడిసన్ విభాగాధిపతికి కూడా పోలీసులు సమన్లు జారీ చేశారు. మంగళవారం రోజు విచారణకు హాజరుకావాలని వారిని ఆదేశించారు. మరోవైపు ఈ కేసులో నిందితులను సాధ్యమైనంత త్వరగా అరెస్టు చేయాలని పోలీసులను బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆదేశించారు. ఆదివారంకల్లా ఈ కేసును పోలీసులు పరిష్కరించలేకపోతే, దీన్ని సీబీఐకి అప్పగిస్తామి దీదీ స్పష్టం చేశారు.