Kharge vs Yogi: ఖర్గే జీ మీ తల్లిని, చెల్లిని చంపిన నిజాంపై కోప్పడండి: యోగి

Update: 2024-11-13 06:11 GMT

దిశ, వెబ్‌డెస్క్: సన్యాసులు రాజకీయాల్లోంచి తప్పుకోవాలన్న కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు యూపీ సీఎం యోగి కౌంటర్ ఇచ్చారు. ఓట్ల కోసం ఖర్గే తన కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని మర్చిపోయారని అన్నారు. ఖర్గే చిన్నప్పటి ఘటనలను గుర్తు చేస్తూ.. 1948లో ఖర్గే తల్లిని, సోదరిని హైదరాబాద్ నిజాం రజాకార్లు హత్య చేశారని, ఆయన ఊరు మొత్తాన్ని తగలబెట్టేశారని అన్నారు. మంగళవారం నాడు మహారాష్ట్రలోని అచల్‌పూర్‌లో నిర్వహించిన ఎలక్షన్ ర్యాలీలో యోగి ఆదిత్యనాథ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘బటేంగే తో కటేంగే’ అంటే మీకు కోపం వస్తోంది కదా. దాన్ని నాపై కాదు.. హైదరాబాద్ నిజాంపై చూపించండి. రజాకార్లు మీ ఊరిని తగలబెట్టారు. హిందువుల్ని దారుణంగా చంపేశారు. మీ తల్లిని, చెల్లిని, మీ కుటుంబీకుల్ని క్రూరంగా హత్య చేశారు. కులాలుగా విడిపోతే జరిగే నష్టమిదే. ఓటు బ్యాంకు కోసం మీరు దాన్ని మర్చిపోయారు’ అంటూ కౌంటర్ ఇచ్చారు. అంతేకాకుండా విడిపోయి ఉంటే జరిగే నష్టం గురించి తెలిసి కూడా ఖర్గే ఆ విషయాన్ని ఒప్పుకోలేకపోతున్నారని, బహుశా ఆ విషయాన్ని అంగీకరిస్తే ముస్లిం ఓట్లు పోతాయని భయపడుతున్నారేమోనని ఎద్దేవా చేశారు. 


👉 Click Here For Tweet!




Similar News