AICC: ఏఐసీసీ కొత్త కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శులతో ఖర్గే, రాహుల్ సమావేశం

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జ్‌ను ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహూల్ గాంధీ,

Update: 2024-09-03 15:21 GMT

దిశ, నేషనల్ బ్యూరో: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జ్‌ను ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహూల్ గాంధీ, AICC ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ మంగళవారం న్యూఢిల్లీలోని ప్రధాన కార్యాలయంలో పార్టీ నూతన కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా పార్టీ సంస్థాగతాన్ని బలోపేతం చేసే అంశాలపై వారు చర్చించారు. ఆగస్టు 30న పార్టీని పునర్వ్యవస్థీకరించడంలో భాగంగా అనేక రాష్ట్రాలు, పార్టీ విభాగాలలో పలువురు కొత్త కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శులను కాంగ్రెస్ నియమించింది. ఈ నేపథ్యంలో వారందరితో సమావేశమైన అగ్రనాయకత్వం పార్టీని ముందుకు తీసుకెళ్లడంతో పాటు ఇంకా పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్బంగా పదవీవిరమణ పొందిన ఏఐసీసీ కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శుల సహకారాన్ని కూడా పార్టీ అభినందించింది. ఈ విషయాన్ని అధ్యక్షుడు ఖర్గే సైతం ఎక్స్‌లో పంచుకున్నారు.

ప్రస్తుత ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో పాటు ఏఐసీసీ కార్యదర్శులుగా నెట్టా డిసౌజా, నీరజ్ కుందన్, నవీన్ శర్మలు పని చేయనున్నారు. పురవ్ ఝా, గౌరవ్ పాంధీలను కాంగ్రెస్ అధ్యక్షుడి కార్యాలయంలో సమన్వయకర్తలుగా, వినీత్ పునియా, రుచిరా చతుర్వేది పార్టీ కమ్యూనికేషన్ విభాగంలో కార్యదర్శులుగా నియమితులయ్యారు. ఆరతి కృష్ణ పార్టీ విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శిగా నియమితులయ్యారు. హర్యానాకు మనోజ్ చౌహాన్, ప్రఫుల్ల వినోదరావు గుడాధే, బీహార్‌కు దేవేంద్ర యాదవ్, సుశీల్ కుమార్ పాసి, షానవాజ్ ఆలం కార్యదర్శులుగా నియమితులయ్యారు. ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్, లడఖ్‌లకు సెక్రటరీలుగా డానిష్ అబ్రార్, దివ్య మదెర్నాతో పాటు ఇంకా పలు రాష్టాలకు కార్యదర్శులను కొత్తగా నియమించారు.


Similar News