బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో కీలక సూత్రధారి అరెస్ట్
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో పురోగతి లభించింది. మూడు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహించిన జాతీయ దర్యాప్తు సంస్థ NIA.. బాంబు బ్లాస్ట్ కు సంబంధించిన కీలక కుట్రదారుడుని అరెస్టు చేసింది.
దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో పురోగతి లభించింది. మూడు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహించిన జాతీయ దర్యాప్తు సంస్థ NIA.. బాంబు బ్లాస్ట్ కు సంబంధించిన కీలక కుట్రదారుడుని అరెస్టు చేసింది. మార్చి 1 న జరిగిన ఈ బ్లాస్ట్ కు సంబంధించిన అన్ని ఆధారాలు సేకరించిన జాతీయ దర్యాప్తు సంస్థ.. ఈ పేలుడు ఘటనలో ముజమ్మిల్ షరీఫ్‌ను సహ-కుట్రదారుగా గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు పత్రికా ప్రకటనలో తెలిపింది. అలాగే ఈ కేసులో వీరితో పాటు ఉన్న. మరో ఇద్దరు నిందితులు ముస్సావిర్ షజీబ్ హుస్సేన్, అబ్దుల్ మతీన్ తాహా ఇప్పటికీ పరారీలో ఉన్నారని దర్యాప్తు సంస్థ తెలిపింది.