పుస్తకాలకు కాషాయికరణ.. సిలబస్ తొలగింపు రాజకీయ ఉద్దేశమేనన్న కేరళ సీఎం

నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్(ఎన్సీఈఆర్టీ) సిలబస్ హేతుబద్ధీకరణ పేరుతో పాఠ్యాంశాలను తొలగించడాన్ని కేరళ సీఎం తప్పు బట్టారు.

Update: 2023-04-07 14:53 GMT

తిరువనంతపురం: నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్(ఎన్సీఈఆర్టీ) సిలబస్ హేతుబద్ధీకరణ పేరుతో పాఠ్యాంశాలను తొలగించడాన్ని కేరళ సీఎం తప్పు బట్టారు. పాఠ్య పుస్తకాల నుంచి తొలగించినంత మాత్రాన చారిత్రక నిజాలను నిరాకరించలేమని ట్వీట్ చేశారు. ఎన్సీఈఆర్టీ తీసుకున్న నిర్ణయం అభ్యంతరకరమని అన్నారు. ‘సంఘ్‌ పరివార్‌ తమ అసలు రంగును బయటపెడుతోందని చరిత్ర పట్ల భయంతో ఉంది. దాంతో చరిత్రను తిరగ రాయడం, అబద్ధాలతో కప్పిపుచ్చడం వంటివి చేస్తున్నారు. ఎన్సీఈఆర్టీ పాఠ్య పుస్తకాల నుండి కొన్ని విభాగాలను తొలగించాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని మనం తీవ్రంగా నిరసించాలి. సత్యాన్ని గెలిపించండి’ అని ట్వీట్ చేశారు.

12వ తరగతి పాఠ్య పుస్తకాల నుంచి మహాత్మా గాంధీ హత్య, ఆరెస్సెస్ పై నిషేధం వంటి పాఠ్యాంశాల తొలగింపుతో పుస్తకాలకు కాషాయికరణ చేస్తున్నారని అన్నారు. పాఠ్యపుస్తకాల ద్వారా పిల్లల మనసుల్లోకి ద్వేషం, విభజన రాజకీయాలను చొప్పించేందుకు ఆర్‌ఎస్‌ఎస్ ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు. దీన్ని వ్యతిరేకిస్తూ పెద్ద నిరసనలు చేపట్టాలని పిలుపునిచ్చారు.

Tags:    

Similar News