Kejriwal: కేజ్రీవాల్ మరింత ధృడంగా బయటకొస్తారు..పంజాబ్ సీఎం భగవంత్ మాన్

ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ త్వరలోనే జైలు నుంచి బయటకు వస్తారని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ చెప్పారు.

Update: 2024-08-16 12:57 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ త్వరలోనే జైలు నుంచి బయటకు వస్తారని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ చెప్పారు. దర్యాప్తు సంస్థల వద్ద కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా ఎటువంటి ఆధారాలూ లేవని, కాబట్టి మరింత మానసిక ధృడత్వంతో రిలీజ్ అవుతారని దీమా వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో ఆప్ సీనియర్ నేత, మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాతో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ..దేశ భవిష్యత్ ఆప్ దేనని తెలిపారు. ఆప్‌ను విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నించిన బీజేపీ తీవ్రంగా విఫలమైందన్నారు. ఎంత భయపెట్టడానికి ప్రయత్నించినా ఆప్ వాటిని ధీటుగా ఎదుర్కొందని చెప్పారు.

ఆప్ ఎంతో ఐక్యంగా ఉందని పార్టీలో ఎటువంటి చీలికలు లేవని స్పష్టం చేశారు. రాజకీయేతర నేపథ్యం నుంచి వచ్చిన పార్టీ కాబట్టే బలంగా నిలబడిందని తెలిపారు. మనీష్ సిసోడియా విడుదలతో పార్టీ మరింత బలపడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. సంజయ్ సింగ్, సిసోడియాలు నియంతృత్వానికి ఎదురు నిలిచి బయటకు వచ్చారని, ఈ తరహాలోనే కేజ్రీవాల్ సైతం బయటకు వస్తారని వెల్లడించారు. ఆప్ జాతీయ పార్టీ కాబట్టి అన్ని రాష్ట్రాల్లో పోటీ చేస్తుందని తెలిపారు. మనీశ్ సిసోడియా మాట్లాడుతూ..పంజాబ్‌లో ఆప్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ప్రశంసించారు. విద్యా వ్యవస్థ అభివృద్ధిలో ఢిల్లీ తర్వాత తదుపరి స్థానంలో పంజాబ్ నిలుస్తుందని తెలిపారు.

Tags:    

Similar News