Kc venugopal: నీతి ఆయోగ్ సమావేశాన్ని కాంగ్రెస్ సీఎంలు బహిష్కరిసారు: కేసీ వేణుగోపాల్
కేంద్ర బడ్జెట్‌లో ఎన్డీయేతర పాలిత రాష్ట్రాలపై వివక్ష చూపినందుకు గాను ఈ నెలలో జరిగే నీతి ఆయోగ్ సమావేశానికి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు హాజరుకావడం లేదని ఆ పార్టీ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ ప్రకటించారు.
దిశ, నేషనల్ బ్యూరో: కేంద్ర బడ్జెట్‌లో ఎన్డీయేతర పాలిత రాష్ట్రాలపై వివక్ష చూపినందుకు గాను ఈ నెలలో జరిగే నీతి ఆయోగ్ సమావేశానికి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు హాజరుకావడం లేదని ఆ పార్టీ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఎక్స్ లో పోస్ట్ చేశారు. ‘ కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ వివక్షతో కూడుకుని ఉంది. ఇది ఫెడరలిజం, రాజ్యాంగ సూత్రాలకు పూర్తిగా విరుద్ధం. దీనికి నిరసనగా జూలై 27వ తేదీన జరగనున్న నీతి ఆయోగ్ సమావేశాన్ని కాంగ్రెస్ సీఎంలు బహిష్కరిస్తారు’ అని పేర్కొన్నారు. అలాగే ఇండియా కూటమి ఎంపీలు పార్లమెంటులో నిరసన తెలపనున్నట్టు తెలిపారు. కాగా, కాంగ్రెస్ పార్టీకి మూడు రాష్ట్రాల్లో తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్‌లలో సీఎంలు ఉన్నారు. మరోవైపు తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించనున్నట్టు తెలిపారు.