రైతులపై మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కర్ణాటక మంత్రి
రైతులపై కర్ణాటక మంత్రి శివానంద మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం రుణాలను మాఫీ చేస్తుండడంతో రైతులు ప్రతి ఏటా కరువును కోరుకుంటున్నారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు
దిశ, వెబ్ డెస్క్ : రైతులపై కర్ణాటక మంత్రి శివానంద మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం రుణాలను మాఫీ చేస్తుండడంతో రైతులు ప్రతి ఏటా కరువును కోరుకుంటున్నారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బెళగావి లో జరిగిన సమావేశంలో పాల్గొన్న మంత్రి రైతుల రుణ మాఫీల గురించి ప్రస్తావిస్తూ... రైతులకు కరెంట్, నీరు ఉచితంగా లభిస్తున్నాయి. చాలా మంది ముఖ్యమంత్రులు రాష్ట్రంలో వ్యవసాయరంగ విస్తరణకు తోడ్పడ్డారు. అయితే ప్రతి ఏటా కరువు రావాలని రైతులు కోరుకుంటున్నారు. అలా కోరుకోవడం సరికాదని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వీడియో కాస్త వైరల్ కావడంతో రాష్ట్ర రాజకీయాలు హిటేక్కాయి. అయితే గతంలో సైతం మంత్రి రైతుల ఆత్మహత్యపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆత్మహత్యకు పాల్పడిన రైతుల కుటుంబాలకు నష్టపరిహారాన్ని పెంచిన తర్వాత రాష్ట్రంలో రైతుల మరణాలు గణనీయంగా పెరిగాయి అంటూ వివాదంలో చిక్కారు.