ప్రభుత్వం పనిచేయడం లేదు.. మ్యానేజ్ చేస్తుందంతే..: మంత్రి
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర ప్రభుత్వం పనిచేయడం లేదని, కేవలం మ్యానేజ్ చేస్తుందంటూ కర్ణాటక రాష్ట్ర న్యాయ, పార్లమెంటరీ వ్యవహారాల..
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర ప్రభుత్వం పనిచేయడం లేదని, కేవలం మ్యానేజ్ చేస్తుందంటూ కర్ణాటక రాష్ట్ర న్యాయ, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి జేసీ మధుస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల లీకైన్ ఓ ఆడియో క్లిప్‌లో మధుస్వామీ రాష్ట్రంలోని ప్రభుత్వ అధికారులను ఉద్దేశించి మాట్లాడిన వ్యాఖ్యలు రాష్ట్రమంతా సంచలన సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలోనే రాష్ట్రంలో ప్రభుత్వం పనిచేయడం లేదని, కానీ అధికారులు ఏదో ఒక రకంగా మ్యానేజ్ చేస్తున్నారని ఆయన అన్నారు. మంత్రి చేసిన వ్యాఖ్యలపై సీఎం బసవరాజు బొమ్మై స్పందించారు. మంత్రి మాటలు వేరే సందర్భంలో చేసినవని చెప్పుకొచ్చారు. ఏదిఏమైనా ప్రస్తుతం కర్ణాటక రాష్ట్ర రాజకీయాల్లో మధుస్వామీ వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారుతున్నాయి. ప్రతిపక్షాలు సైతం అధికార పార్టీ నాయకుడే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటే రాష్ట్రంలో పరిస్థితులను అర్థం చేసుకోవలని అంటున్నారు.