మతం మారాలంటూ వివాహితపై రేప్.. భార్య ఎదుటే కామాంధుడి పైశాచికం!?

కర్ణాటకలో కాంగ్రెస్ నేత కుమార్తె హత్య మర్చిపోకముందే మరో ఘోరమైన ఉదంతం వెలుగులోకి వచ్చింది. 28 ఏళ్ల వివాహితను బ్లాక్ మెయిల్ చేసి ఇస్లాం మతంలోకి మరాలని బలవంత పెట్టినట్లు కేసు నమోదైంది.

Update: 2024-04-21 18:29 GMT

దిశ, నేషనల్ బ్యూరో: కర్ణాటకలో కాంగ్రెస్ నేత కుమార్తె హత్య మర్చిపోకముందే మరో ఘోరమైన ఉదంతం వెలుగులోకి వచ్చింది. 28 ఏళ్ల వివాహితను బ్లాక్ మెయిల్ చేసి ఇస్లాం మతంలోకి మరాలని బలవంత పెట్టినట్లు కేసు నమోదైంది. దంపతులు సహా ఏడుగురిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు బెళగావి పోలీసులు.

రఫిక్ అనే నిందితుడు మహిళను మభ్యపెట్టి ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని తెలిపారు అధికారు. ఆ తర్వాత మహిళతో సన్నిహితంగా ఉన్న ఫొటోలు తీసి ఆమెను బ్లాక్ మెయిల్ చేసినట్లు వివరించారు. మహిళను హిందూ మతం నుంచి ఇస్లాంలోకి మారాలని డిమాండ్ చేశారని వెల్లడించారు.

నిందితుడు రఫిక్, అతడి భార్య ఇద్దరూ కలిసి బాధితురాలని బెళగావిలోని తమ ఇంట్లోకి తీసుకొచ్చారని తెలిపారు. నిందితులిద్దరూ చెప్పినట్లు చేయాలని మహిళను బలవంతపెట్టినట్లు వివరించారు. రఫిక్ తన భార్య ఎదుటే తనపై అత్యాచారం చేశాడని మహిళ ఆరోపించిందని బెళగావి ఎస్పీ భీమశంకర్ గులేడ తెలిపారు. మహిళను కుంకుమ పెట్టుకోవద్దని.. బుర్ఖా ధరించి రోజుకు ఐదుసార్లు నమాజ్ చేయాలని ఒత్తిడితెచ్చినట్లు వివరించారు.

తనను కులం పేరుతో ధూషించారని.. తక్కువ కులానికి చెందిన మహిళలవని.. అందుకే మతం మారాలని నిందితుడు చెప్పాడని మహిళ ఆరోపించింది. తన భర్తకు విడాకులు ఇవ్వాలని నిందితుడు డిమాండ్ చేసినట్లు బాధితురాలు వాపోయింది. తనతో సన్నిహిత ఫోటోలను బయటపెడతానని నిందితుడు బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొంది. మతం మార్చుకోకుంటే తనను చంపేస్తామని ఆ జంట బెదిరించారని తెలిపింది.

మహిళ ఫిర్యాదుల ఆధారంగా ఏడుగురిపై సౌందట్టి పోలీస్ స్టేషన్ లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. నిందితులపై అత్యాచారం, కిడ్నాప్, నేరపూరిత బెదిరింపులు సహా పలు కేసులు నమోదు చేశారు పోలీసులు.


Similar News