Karnataka : ‘‘కర్ణాటక గవర్నర్‌కు బంగ్లాదేశ్ ప్రధాని గతే’’.. కాంగ్రెస్ ఎమ్మెల్సీ వివాదాస్పద వ్యాఖ్యలు

దిశ, నేషనల్ బ్యూరో : మైసూర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా) స్కాంలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్యపై విచారణకు అనుమతులిస్తూ గవర్నర్ థావర్ ‌చంద్ గెహ్లాట్ ఇటీవల సంచలన ఆదేశాలు జారీ చేశారు.

Update: 2024-08-19 13:14 GMT

దిశ, నేషనల్ బ్యూరో : మైసూర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా) స్కాంలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్యపై విచారణకు అనుమతులిస్తూ గవర్నర్ థావర్ ‌చంద్ గెహ్లాట్ ఇటీవల సంచలన ఆదేశాలు జారీ చేశారు. వీటిపై రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నేతలు భగ్గుమంటున్నారు. ‘‘సీఎంను విచారించాలంటూ ఇచ్చిన ఆదేశాలను వెనక్కి తీసుకోకపోతే గవర్నర్‌కు బంగ్లాదేశ్ తరహా చేదు అనుభవమే ఎదురవుతుంది’’ అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఇవాన్ డిసౌజా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

గవర్నర్ ఆదేశాలను వ్యతిరేకిస్తూ మంగళూరులో జరిగిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘‘సీఎంకు వ్యతిరేకంగా ఇచ్చిన ఆదేశాలను గవర్నర్ వెనక్కి తీసుకోకపోయినా.. గవర్నర్‌ను పదవి నుంచి రాష్ట్రపతి తప్పించకపోయినా తీవ్ర పరిణామాలు ఉంటాయి. బంగ్లాదేశ్‌లో ప్రధానమంత్రి హసీనాకు ఎదురైన పరిస్థితే గవర్నర్‌కు కూడా ఎదురవుతుంది. కర్ణాటక నుంచి గవర్నర్ వెళ్లిపోవాల్సి వస్తుంది. మా తదుపరి నిరసన గవర్నర్ ఆఫీసు దగ్గరే ఉంటుంది’’ అని ఎమ్మెల్సీ ఇవాన్ డిసౌజా వ్యాఖ్యానించారు.

Tags:    

Similar News