కర్ణాటక సీఎం, మంత్రులకు బాంబు బెదిరింపులు..!
కర్ణాటక ప్రభుత్వానికి బెదిరింపు ఈమెయిల్ వచ్చింది. దీంతో ఒక్కసారిగా అలెర్టయ్యింది అక్కడి యంత్రాంగం. బెంగళూరులో శనివారం పేలుడు జరుగుతుందని బెదిరింపు మెయిల్ పంపాడు ఓ వ్యక్తి.
దిశ, నేషనల్ బ్యూరో: కర్ణాటక ప్రభుత్వానికి బెదిరింపు ఈమెయిల్ వచ్చింది. దీంతో ఒక్కసారిగా అలెర్టయ్యింది అక్కడి యంత్రాంగం. బెంగళూరులో శనివారం పేలుడు జరుగుతుందని బెదిరింపు మెయిల్ పంపాడు ఓ వ్యక్తి. కన్నడ సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, హోంమంత్రి, బెంగళూరు సీపీలను ఉద్దేశించి ఓ వ్యక్తి ఈమెయిల్ పంపాడు.
Shahidkhan10786@protonmail.com అనే మెయిల్ ఐడీ నుంచి బెదిరింపులు వచ్చాయి. కాగా..ఈ-మెయిల్ పంపిన వ్యక్తిని షాహిద్ ఖాన్‌గా గుర్తించారు. ఈమెయిల్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం శనివారం మధ్యాహ్నం 2.48 గంటలకు రెస్టారెంట్లు, ఆలయాలు, బస్సులు, రైళ్లు వంటి రద్దీ ప్రదేశాల్లో పేలుడు జరుగుతుందని హెచ్చరించాడు.
బహిరంగ ప్రదేశాలు, కార్యక్రమాలల్లోనూ బాంబులను కూడా అమరుస్తామని మెయిల్ పంపిన వ్యక్తి బెదిరించాడు. పేలుడును ఆపేందుకు రూ. 20 కోట్లుపైగా చెల్లించాలని మెయిల్ లో డిమాండ్ చేశారు. మరోవైపు బెంగళూరు సిటీ క్రైం బ్రాంచ్ పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపైన దర్యాప్తు చేపడుతున్నారు.