పెట్రోల్ ధరల పెంపుపై నిరసనలో పాల్గొన్న కర్నాటక బీజేపీ నేత గుండెపోటుతో మృతి

ఈ నిరసనల్లో పాల్గొన్న కార్ణాటక బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్సీ ఎం బి భానుప్రకాష్ గుండెపోటుతో మరణించారు.

Update: 2024-06-17 17:30 GMT

దిశ, నేషనల్ బ్యూరో: కర్ణాటక ప్రభుత్వం గతవారం పెట్రోల్, డీజిల్ ధరలను పెంచిన సంగతి తెలిసిందే. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా ప్రతిపక్షాలు నిరసనలు చేపట్టాయి. సోమవారం పెంచిన ధరలపై స్థానిక బీజేపీ నేతలు రాష్ట్రవ్యాప్త నిరసనలు చేపట్టింది. ఈ నిరసనల్లో పాల్గొన్న కార్ణాటక బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్సీ ఎం బి భానుప్రకాష్ గుండెపోటుతో మరణించారు. శివమొగ్గలో జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు కారు ఎక్కుతున్న సమయంలో ఆయన ఒక్కసారిగా కుప్పకూలారు. సన్నిహితులు తక్షణం సమీప ఆసుపత్రికి తరళించగా అప్పటికే ఆయన మృతి చెందినట్టు పోలీసులు వర్గాలు వెల్లడించాయి. 69 ఏళ్ల భానుప్రకాష్ గతంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. కాగా, ఇటీవల పెట్రోల్, డీజిల్ ధరలపై పన్నులు ప్రభుత్వం పెంచింది. దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా సమర్థించుకున్నారు. ఇతర రాష్ట్రాల కంటే కర్ణాటకలో పెట్రోల్, డీజిల్ ధరలు తక్కువగానే ఉన్నాయన్నారు.  


Similar News