నామినేషన్ వేసిన తర్వాత కంగనా ప్రకటన ఇదే..!
బాలీవుడ్ క్వీన్, బీజేపీ అభ్యర్థి కంగనా రనౌత్ మండి లోక్ సభ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. ఆమె వెంట తన తల్లి ఆశా రనౌత్, సోదరి రంగోలి రనౌత్ ఉన్నారు.
దిశ, నేషనల్ బ్యూరో: బాలీవుడ్ క్వీన్, బీజేపీ అభ్యర్థి కంగనా రనౌత్ మండి లోక్ సభ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ వేసేటప్పుడు ఆమె వెంట తన తల్లి ఆశా రనౌత్, సోదరి రంగోలి రనౌత్ ఉన్నారు. నామినేషన్ వేయకముందు కంగనా మీడియాతో మాట్లాడారు. మండి వాసుల ప్రేమే తనను తిరిగి సొంత రాష్ట్రానికి తీసుకొచ్చిందని పేర్కొన్నారు. సినిమాల్లోలాగా.. రాజకీయాల్లోనూ రాజకీయాల్లోనూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలని భావిస్తున్నానని కంగనా తెలిపింది.
దేశంలో మహిళలు ప్రతి రంగంలోనూ ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు కంగనా. అయితే కొన్నేళ్ల క్రితం మండి ప్రాంతంలో ఇప్పటికీ భ్రూణహత్యలు జరగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం మండికి చెందిన మహిళలు విద్య, రాజకీయాల్లో మాత్రమే కాకుండా.. ఆర్మీలో ఉన్నారని కంగనా పేర్కొన్నారు.
తన నామినేషన్ దాఖలు చేసిన తర్వాత కంగనా రనౌత్ మాట్లాడుతూ.. మండి లోక్సభ స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేశానని చెప్పారు. మండి నుంచి పోటీ చేసే అవకాశం తనకు లభించడం గర్వించదగ్గ విషయమని పేర్కొన్నారు. బాలీవుడ్లో విజయం సాధించినట్టుగానే.. రాజకీయాల్లోనూ విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు.