Kalyan Banerjee: నా కుటుంబాన్ని దూషించారు.. గాజు సీసా ఘటనపై ఎంపీ కళ్యాణ్ బెనర్జీ

వక్ఫ్ బిల్లుపై ఇటీవల జరిగిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ సమావేశంలో టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ ఓ గాజు సీసాను పగుళగొట్టిన విషయం తెలిసిందే.

Update: 2024-10-29 12:00 GMT
Kalyan Banerjee: నా కుటుంబాన్ని దూషించారు.. గాజు సీసా ఘటనపై ఎంపీ కళ్యాణ్ బెనర్జీ
  • whatsapp icon

దిశ, నేషనల్ బ్యూరో: వక్ఫ్ బిల్లు(Waqf bill)పై ఇటీవల జరిగిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ (Jpc) సమావేశంలో తృణమూల్ కాంగ్రెస్(Tmc) ఎంపీ కళ్యాణ్ బెనర్జీ(Kalyan benarjee) అనుచితంగా ప్రవర్తించి ఓ గాజు సీసాను పగుళగొట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనపై ఆయన తాజాగా స్పందించారు. గాజు సీసా విసిరేయాలనేది తన ఉద్దేశం కాదని తెలిపారు. మంగళవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ‘వాగ్వాదం జరిగిన సమయంలో బీజేపీ ఎంపీ గంగోపాధ్యాయ(Gangopadyaya) దుర్భాషలాడారు. నాపై, నా బంధువులపై అనుచిత పదజాలంతో దూషించారు. ఈ క్రమంలోనే ఆయనను ప్రశ్నించాను. కానీ ఎంతకీ వినకుండా అయన తన మాటలను కొనసాగించారు’ అని తెలిపారు. ఈ సమయంలో జేపీసీ చైర్మన్‌గా ఉన్న జగదాంబికా పాల్ (Jagadhaambika pal) గంగోపాధ్యాయకు మద్దతు తెలిపారని, ఈ వ్యవహారం తనకు ఆగ్రహం తెప్పించిందని చెప్పారు. దీంతో పక్కన టేబుల్ పై ఉన్న గాజు సీసాను పగుళగొట్టానని కానీ దానిని చైర్మన్ పైకి విసిరి వేయాలని అనుకోలేదని స్పష్టం చేశారు. ఘటన సమయంలో తన వేళ్లకు స్వల్ప గాయమైందని తెలిపారు. నియమ నిబంధనలను ఎంతో గౌరవిస్తానన్నారు.

Tags:    

Similar News