సుప్రీంకోర్ట్ సీజేఐగా జస్టిస్ సంజీవ ఖన్నా.. ఆమోదించిన రాష్ట్రపతి

ప్రస్తుత భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వై.వీ చంద్రచూడ్(chandrachud) పదవి కాలం త్వరలోనే ముగియనున్న విషయం తెలిసిందే.

Update: 2024-10-24 15:56 GMT

దిశ, వెబ్ డెస్క్ : ప్రస్తుత భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వై.వీ చంద్రచూడ్(chandrachud) పదవి కాలం త్వరలోనే ముగియనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్ట్ చీఫ్ జస్టిస్ గా సంజీవ్ ఖన్నా(Sanjeev Khanna)ను ప్రకటించారు. గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(Droupadi Murmu).. చీఫ్ జస్టిస్ గా సంజీవ్ ఖన్నా నియమకానికి ఆమోద ముద్ర వేశారు. కాగా ప్రస్తుత చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ పదవీకాలం నవంబర్ 11తో ముగియనుండగా.. అదేరోజు కొత్త చీఫ్ జస్టిస్ ప్రమాణస్వీకారం చేస్తారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ తన ఎక్స్ ఖాతా వేదికగా ఓ ప్రకటన విడుదల చేశారు. కాగా జస్టిస్ సంజీవ్ ఖన్నా 2019 జనవరి 18న సుప్రీంకోర్ట్ న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ గా, భోపాల్ నేషనల్ జ్యుడీషియల్ అకాడమీ పాలక మండలి సభ్యులుగా కూడా ఉన్నారు.

Tags:    

Similar News