US President: కరోనా నుంచి కోలుకున్న బైడెన్

అమెరికా అధ్యక్షుడు(US President) జో బైడెన్ (Joe Biden) ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వార్తలొచ్చాయి.

Update: 2024-07-24 04:04 GMT

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా అధ్యక్షుడు(US President) జో బైడెన్ (Joe Biden) ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వార్తలొచ్చాయి. హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారని పుకార్లు పుట్టుకొచ్చాయి. కాగా.. ఈ ఊహాగానాల మధ్య జోబైడెన్ తొలిసారి బహిరంగా కన్పించారు. ఆయన కరోనా(Corona) నుంచి కోలుకున్నారు. కొవిడ్‌ నెగెటివ్‌ రావడంతో మంగళవారం వైట్ హౌజ్(White House) చేరుకున్నారు. బైడెన్‌ (Biden) ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు సూచించారు. యాంటిజెన్‌ పరీక్షలో ఆయనకు నెగెటివ్‌గా వచ్చినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. ప్రస్తుతం ఎలాంటి లక్షణాలు కూడా లేవని తెలిపారు. ఆయన ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు సమాచారం అందజేస్తామని పేర్కొన్నారు. ఇకపోతే, శ్వేతసౌధం వెళ్లేముందు ఎలా ఉన్నారని మీడియా అడిగిన ప్రశ్నకు బైడెన్‌ (Biden).. ‘అంతా సవ్యంగానే ఉంది’ అని థంబ్ నెయిల్ చూపించి బదులిచ్చారు. కాగా.. అధ్యక్ష రేసు నుంచి ఎందుకు వైదొలగాల్సి వచ్చింది? రిపబ్లికన్‌ అభ్యర్థి ట్రంప్‌ను(Donald Trump) ఓడించే సామర్థ్యం కమలా హారిస్‌కు(Kamala Harris) ఉందా? అని అడిగిన ప్రశ్నలకు మాత్రం ఆయన బదులివ్వలేదు. ఆ తర్వాత వైట్ హౌజ్ వచ్చాక సోషల్ మీడియా ఎక్స్ లో బైడెన్ ఒక పోస్టు పెట్టారు. "వైట్ హౌస్‌కి తిరిగి రావడం చాలా ఆనందంగా ఉంది. నేను ఓవల్ కార్యాలయానికి తిరిగి వచ్చాను. రోజువారీ ఇంటెలిజెన్స్ బ్రీఫింగ్ కోసం జాతీయ భద్రతా బృందంతో భేటీ అయ్యా. కమాండర్-ఇన్-చీఫ్‌గా పనిచేయడం నా జీవతంలో గొప్ప గౌరవంగా మారింది” అని రాసుకొచ్చారు.

ఐసోలేషన్ లో బైడెన్

గత బుధవారం కొవిడ్‌ సోకినట్లు తేలిన తర్వాత బైడెన్‌ డెలావెర్‌లోని తన నివాసంలో ఐసోలేషన్‌లోకి వెళ్లారు. ఆయన క్వారంటైన్ లో ఉండగానే అధ్యక్ష రేసు నుంచి తప్పుకున్నట్లు ప్రకటించారు. ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌కు మద్దతు తెలిపారు. అయితే, ఆయన క్యారంటైన్ లో ఉండగానే బైడెన్ పై పుకార్లు పుట్టుకొచ్చాయి. ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు కథనాలు వచ్చాయి. “వేర్ ఈజ్ జో" అని సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.


Similar News