వరల్డ్ ర్యాంకింగ్స్ : దేశంలో నంబర్ 1 యూనివర్సిటీ .. ఏదో తెలుసా ?

దిశ, నేషనల్ బ్యూరో : భారత ఉన్నత విద్యాసంస్థలు మరోసారి ప్రపంచ యవనికపై తళుక్కుమని మెరిశాయి.

Update: 2024-04-10 18:30 GMT

దిశ, నేషనల్ బ్యూరో : భారత ఉన్నత విద్యాసంస్థలు మరోసారి ప్రపంచ యవనికపై తళుక్కుమని మెరిశాయి. మన దేశంలోని నంబర్ 1 యూనివర్సిటీగా జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్‌యూ) నిలిచింది.ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ యూనివర్సిటీల లిస్టుల జాబితాలో దీనికి 20వ ర్యాంకు లభించింది. ఇక బిజినెస్ అండ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ విషయంలో టాప్-25 విద్యాసంస్థల లిస్టును తయారుచేయగా ఐఐఎం - అహ్మదాబాద్‌కు అందులో చోటు దక్కింది. ఇక ఇదే కేటగిరిలోని టాప్-50 విద్యాసంస్థల లిస్టులో ఐఐఎం - బెంగళూరు, ఐఐఎం - కోల్‌కతా ర్యాంకింగ్స్‌ను సొంతం చేసుకున్నాయి. బ్రిటన్‌కు చెందిన ఉన్నత విద్యాసంస్థల విశ్లేషణ సంస్థ క్వాక్‌వారెల్లి సైమండ్స్ (క్యూఎస్) ‘‘క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్’’ పేరుతో విడుదల చేసిన నివేదికలో ఈవివరాలను వెల్లడించారు. దంత వైద్యశాస్త్రంలో అత్యుత్తమ ప్రమాణాలతో కూడిన బోధన అందించే విషయంలో చెన్నైలోని సవిత ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అండ్ టెక్నికల్ సైన్సెస్ ప్రపంచవ్యాప్తంగా 24వ స్థానంలో నిలిచింది. విద్యారంగంలో అత్యధికంగా రీసెర్చ్ జరుగుతున్న దేశాల లిస్టులో మన ఇండియాకు నాలుగో స్థానం దక్కింది. 2017 నుంచి 2022 మధ్యకాలంలో భారతీయ ఉన్నత విద్యాసంస్థలు 13 లక్షల అకడమిక్ పేపర్లను పబ్లిష్ చేశాయి. ఈ లిస్టులో నంబర్1 ప్లేస్‌లో చైనా(45 లక్షల అకడమిక్ పేపర్లు) నిలిచింది. రెండోస్థానంలో అమెరికా (44 లక్షలు), మూడో స్థానంలో బ్రిటన్ (14 లక్షలు) ఉన్నాయి.

Tags:    

Similar News