Champai Soren : జార్ఖండ్‌లో చంపై సోరెన్ కొత్త రాజకీయ పార్టీ

రాష్ట్రంలో కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయాలని ఆయన నిర్ణయించుకున్నారు.

Update: 2024-08-21 11:44 GMT

దిశ, నేషనల్ బ్యూరో : జార్ఖండ్ మాజీ సీఎం చంపై సోరెన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయాలని ఆయన నిర్ణయించుకున్నారు. తనతో కలిసొచ్చే భావ సారూప్యత కలిగిన పార్టీలతో కలిసి నడుస్తానని వెల్లడించారు. ఈమేరకు చంపై సోరెన్ బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘నా ముందు మూడు మార్గాలు ఉన్నాయని ఇప్పటికే చెప్పాను. వాటిలో రాజకీయాలను వీడాలనే ఆప్షన్‌ను వాడదల్చుకోలేదు. సొంత పార్టీ పెట్టే ఆప్షన్‌నే నేను ఎంపిక చేసుకున్నాను. పార్టీని ఏర్పాటు చేసి బలోపేతం చేస్తాను. కాలక్రమంలో నాకు నచ్చిన రాజకీయ పార్టీలతో జట్టు కడతాను’’ అని చంపై సోరెన్ వెల్లడించారు.

‘‘జార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు చాలా తక్కువ టైం ఉంది.. ఇప్పటికిప్పుడు కొత్త పార్టీ ఏర్పాటు సాధ్యమవుతుందా ?’’ అని మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన బదులిస్తూ.. ‘‘అది మీ సమస్య కాదు కదా’’ అని చెప్పారు. ‘‘నేను ఒక్క పిలుపు ఇస్తే 30వేల నుంచి 40వేల మంది కార్యకర్తలు సమావేశం కావడానికి సిద్ధంగా ఉన్నారు. అలాంటప్పుడు కొత్త పార్టీ ఏర్పాటుకు ఆటంకం ఎందుకు ఉంటుంది. వారంలోగా నా రాజకీయ పార్టీ ఏర్పాటు ప్రక్రియ పూర్తయిపోతుంది’’ అని చంపై సోరెన్ వెల్లడించారు.

Tags:    

Similar News