Jharkhand: జార్ఖండ్ డీజీపీగా అజయ్ కుమార్ సింగ్.. ఆమోదం తెలిపిన ఈసీ

జార్ఖండ్ నూతన డీజీపీగా సీనియర్ అధికారి అజయ్ కుమార్ సింగ్ నియామకానికి ఎలక్షన్ కమిషన్(ఈసీ) ఆమోదం తెలిపింది.

Update: 2024-10-21 12:42 GMT

దిశ, నేషనల్ బ్యూరో: జార్ఖండ్ నూతన డీజీపీగా సీనియర్ అధికారి అజయ్ కుమార్ సింగ్ నియామకానికి ఎలక్షన్ కమిషన్(ఈసీ) సోమవారం ఆమోదం తెలిపింది. తాత్కాలిక డీజీపీగా ఉన్న అనురాగ్ గుప్తాను ఇటీవలే తొలగించిన ఈసీ..నూతన డీజీపీని నియమించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో ముగ్గురు అధికారుల పేర్లను ప్రభుత్వం సిఫార్సు చేయగా ఈసీ అజయ్ సింగ్‌ను డీజీపీగా ఎంపిక చేసింది. అజయ్ కుమార్ 1989 బ్యాచ్ ఐపీఎస్ అధికారి కావడం గమనార్హం. ఆయన గతంలో రాష్ట్రంలో పలు హోదాల్లో పని చేశారు. కాగా, గత ఎన్నికల్లో అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణల కారణంగా డీజీపీ అనురాగ్ గుప్తాను ఆ పదవి నుంచి ఈసీ తొలగించింది. దీంతో ఆయన స్థానంలో తాజాగా అజయ్ నియామకమయ్యారు. జార్ఖండ్‌లో నవంబర్ 13, 20 తేదీల్లో రెండు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.


Similar News