నితీశ్ జంప్.. ఇండియాకు లాభం.. ఎన్డీఏకు నష్టం :కేజ్రీవాల్

దిశ, నేషనల్ బ్యూరో: ఇండియా కూటమి నుంచి ఎన్డీఏలోకి జంప్ అయిన బిహార్ సీఎం నితీశ్ కుమార్‌పై ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ సున్నిత విమర్శలు గుప్పించారు.

Update: 2024-01-29 14:19 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఇండియా కూటమి నుంచి ఎన్డీఏలోకి జంప్ అయిన బిహార్ సీఎం నితీశ్ కుమార్‌పై ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ సున్నిత విమర్శలు గుప్పించారు. ఇండియా కూటమి నుంచి జేడీయూ చీఫ్ నితీశ్ వైదొలగడాన్ని పెద్ద తప్పుగా అభివర్ణించారు. కూటమిలో నితీశ్ కొనసాగి ఉండాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామిక రాజకీయాల్లో ఈవిధమైన ప్రవర్తన సరికాదని నితీశ్‌కు హితవు పలికారు. నితీశ్ వెళ్లిపోయినా వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమికి పెద్దగా నష్టమేం జరగదని.. ఎన్డీఏకు మాత్రం నష్టమే కలుగుతుందని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ఢిల్లీ, పంజాబ్‌లలోనూ కాంగ్రెస్, ఆప్‌లు కలిసి పనిచేస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, గతేడాది మేలో అరవింద్ కేజ్రీవాల్‌ను నితీశ్ కుమార్ కలిసి ఇండియా కూటమిలో చేరాలని ఆహ్వానించారు. అలాంటిది ఇప్పుడు ఏకంగా నితీశే ఎన్డీఏలోకి జంపై పోవడం గమనార్హం.

Tags:    

Similar News